India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ఆమోదించిన ప్రజా పాలన విజయోత్సవాల అధికారిక లోగోను అన్ని ప్రింట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఉపయోగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజా పాలనపై సమీక్షించారు.
ఫిర్యాదుదారులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అనవసరంగా కాలయాపన చేయకుండా ఫిర్యాదులు పరిష్కరించాలని అన్నారు
జిల్లాలో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగాయి. ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుడ్డు ధర రూ.6లు ఉండగా ఇప్పుడు రూ.7కు చేరింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం 3 రోజులు కోడి గుడ్లు విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో గుడ్డుకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో తమపై అదనపు భారం పడుతుందన్నారు.
నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు <<14758454>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> గ్రామానికి చెందిన వేణుకుమార్ రెడ్డి(29)కి ఇటీవలే నిశ్చితార్థం కాగా శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఇష్టం లేకనే చనిపోతున్నానని వేణు అతని అన్న ప్రవీణ్‌కు వాయిస్ మేసేజ్ పంపాడు. అతను స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లేలోపే సూసైడ్ చేసుకున్నాడు.
అనంతగిరి మండలం శాంతినగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వీరబాబు వ్యవసాయ బావిలో స్నానానికి దూకగా, అతనితోపాటు విద్యార్థి తిరుమలేష్ దూకాడు. ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు.
నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుకుమార్ రెడ్డికి కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయ్యిందని తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని డిసెంబర్ 3న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తమిళనాడులో రాష్ట్రంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడింది. మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ వెదర్ ఏర్పడింది. దీంతో అధికారులు ఈ జిల్లాలలోని ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిడమనూరు మోడల్ స్కూల్‌లో విద్యార్థినుల పట్ల సోషల్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడవ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.7.31 లక్షలు పోగొట్టుకున్న ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బండారు రమాదేవికి ఇటీవల ముంబై పోలీస్ అధికారులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె దశలవారీగా రూ.7. 31 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆ నంబర్‌కు రమాదేవి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ మేరకు బాధితురాలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.