Nalgonda

News November 30, 2024

NLG: డిసెంబర్ 6 వరకు పెన్షన్ల పంపిణీ

image

ఈనెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లాలో వివిధ రకాల చేయూత, ఆసరా ( వృద్ధాప్య, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పెన్షన్లు) పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెన్షన్లు పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేస్తామని.. పింఛన్దారులు పెన్షన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి తీసుకోవాలని సూచించారు.

News November 30, 2024

ఎంజీయూ నుంచి మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

image

MGU కామర్స్ విభాగం అధ్యాపకుడు డా కొసనోజు రవిచంద్ర తెలంగాణలోని నూతనంగా ఏర్పాటైన నాలుగు యూనివర్సిటీల్లో మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ రీసర్చ్ స్కాలర్ గా చేరడంతో పాటు ఐసీఎస్ఎస్ఆర్ 2024-25 ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. రవిచంద్ర తన పీజీ ఎంజీయూలోనే అభ్యసించి, తన గురువు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కౌత శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.

News November 28, 2024

డిసెంబర్ 5లోగా ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

image

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాటితో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

News November 28, 2024

SRPT: విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్రీ పోస్ట్ మెట్రిక్యులేషన్ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ సమస్యలు లేకుండా పరిష్కరించాలని అన్నారు.

News November 27, 2024

NLG: రేపటి డిగ్రీ పరీక్షలు యథాతధం

image

ఈ నెల 28 (గురువారం) నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీఈవో డా.జి.ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. డిగ్రీ పరీక్షలకు విద్యార్థులంతా హాజరుకావాలని కోరారు.

News November 27, 2024

నల్లగొండ జిల్లాలో రెండు కొత్త మండలాలు

image

నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, గుడిపల్లిలను మండల ప్రజాపరిషత్‌లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది . కొత్తగా ఈ మండలాలకు ప్రజాపరిషత్‌ ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఎంపీడీవో, ఎంపీవో, ఇతర సిబ్బంది నియామకం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీలు రానున్నారు.

News November 27, 2024

నల్గొండ రీజీయన్‌ RTCలో 102 కాంట్రాక్టు ఉద్యోగాలు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. నల్గొండ రీజీయన్‌లో 102 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

News November 26, 2024

జాతీయ రహదారుల పురోగతిపై కోమటిరెడ్డి సమీక్ష

image

జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో NH, AI, మోర్త్ అధికారులు శివశంకర్, కృష్ణ ప్రసాద్, రాష్ట్ర R&B శాఖ స్పెషల్ సెక్రెటరీ, ఆర్ఆర్ఆర్ పిడి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

News November 26, 2024

నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి

image

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది. 

News November 26, 2024

నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి

image

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.