Nalgonda

News May 5, 2024

అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ సస్పెండ్: ఎస్పీ చందనా

image

అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతేపల్లి స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ పి.మహేష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28న కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వాహనంలో 9 బీర్లు ఉండగా వారిని కేసు నమోదు బెదిరించి చేస్తామని చెప్పి పెట్రోల్ బంకు ద్వారా రూ.6 వేలు ఫోన్ చేయించుకోవడంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

News May 5, 2024

నల్లగొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

image

నల్లగొండలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు వైర్లు తెగిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

News May 5, 2024

NLG: తీవ్ర పని ఒత్తిడిలో అంగన్వాడీలు

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం శ్రమకు తగిన వేతనం లభించడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. పని భారం తగ్గించాలని కోరుతున్నారు.

News May 5, 2024

NLG: బీర్లు నో స్టాక్.. మద్యం ప్రియులకు నిరాశ

image

భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లను తాగి ఉపశమనం పొందాలనుకున్నా వారికి నిరాశే కలుగుతుంది.

News May 5, 2024

NLG: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు 

image

నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం , మాడ్గులపల్లి, నాంపల్లి, తిప్పర్తి మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి మండలం కోదాండాపురం, నిడమనూరు, హాలియా, ఇబ్రహీంపేట, కనగల్ తదితర మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 5, 2024

గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి

image

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు ర్యాలీలూ,  సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ,ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.

News May 5, 2024

భిన్నమైన తీర్పిస్తారా..?

image

2019 ఎన్నికల్లో నల్గొండ MP స్థానంలో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 2018లో ఆ లోక్‌సభ పరిధిలోని SRPT, KDD, HNR, MLG, సాగర్‌, NLG, DVK అసెంబ్లీ స్థానాలు BRS విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో SRPT మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు పాత ఒరవడికి కట్టుబడి భిన్నమైన తీర్పు ఇస్తారా అనే భావన వ్యక్తం అవుతోంది.

News May 5, 2024

నల్గొండ: మొత్తం 11 నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

News May 5, 2024

సూర్యాపేట: వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

image

అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియలలో వ్యవసాయ బావిలో పడి జల్లా రామకృష్ణ అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ పొలం దగ్గర వ్యవసాయ మోటారు చూడటానికి వెళ్లాడు. బావిలో నీరు తాగేందుకు దిగగా కాలుజారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.

News May 5, 2024

NLG: మిగిలింది వారం రోజులే

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.