Nalgonda

News May 31, 2024

నల్గొండ: 3 నుంచి బడి బాట.. వారే టార్గెట్

image

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి బడి బాట కార్యక్రమం చేపట్టనుంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ఉండనుంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2,457 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2022-23లో ఒక్క విద్యార్థి లేని సూల్స్ 109 ఉన్నాయని, ఇది ఆందోళనకరమని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ముఖ్యమని విద్యా వేత్తలు చెబుతున్నారు.

News May 31, 2024

ఇక రెగ్యులర్ సిబ్బందితో పన్ను వసూళ్లు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పురపాలికలో అవకతవకలు జరగకుండా రాష్ట్ర పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను వసూలు విధానంలో మార్పు చేసింది. ఇకనుంచి పట్టణాల్లో రెగ్యులర్ సిబ్బందికే పన్ను వసూలు బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేపట్టింది. మున్సిపాలిటీలో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఔట్సోర్సింగ్ ను నగదు లావాదేవీల నుంచి తప్పించేలా ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.

News May 31, 2024

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన వనం రేవతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ చౌటుప్పల్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News May 31, 2024

నల్గొండ: రూ.524.85 కోట్లతో బైపాస్

image

నల్గొండ బైపాస్‌ను 14 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి కేంద్రంతో, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు ఆచరణ రూపం దాల్చనున్నాయి. నార్కట్ పల్లి- అద్దంకి జాతీయ రహదారికి, మాచర్లకు వెళ్లే హైవేను అనుసంధానిస్తూ నిర్మించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే టెండర్లు పిలవనున్నారు.

News May 31, 2024

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ షురూ

image

NLG జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలోని 435880 మంది ఆహార భద్రత కార్డుదారులకు జూన్ 2024 మాసానికి సంబంధించి 5949.848 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డిఎస్ఓ తెలిపారు.

News May 30, 2024

మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య

image

మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన జెవాజి సాయిలు( 80)ను అదే గ్రామానికి చెందిన జెవాజి శ్యామ్(32) మంత్రాల నెపంతో గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. శవాన్ని గడ్డివాములో దాచినట్లు పోలీసులకు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీశారు.

News May 30, 2024

రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ షురూ

image

NLG జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలోని 435880 మంది ఆహార భద్రత కార్డుదారులకు జూన్ 2024 మాసానికి సంబంధించి 5949.848 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డిఎస్ఓ తెలిపారు.

News May 30, 2024

జిల్లాలో విత్తనాల కొరత లేదు: NLG కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో పత్తి, ఇతర పంటల విత్తనాలకు ఎలాంటి కొరత లేదని.. రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మండలాల వారిగా అవసరమైన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు 65% రాయితీపై గుర్తింపు పొందిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

News May 30, 2024

NLG: ‘మత్స్య సొసైటీకి ఎన్నికలను ఏర్పాటు చేయాలి’

image

నల్గొండ జిల్లాలోని మత్స్య సొసైటీకి ఎన్నికలను నిర్వహించాలని ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ అధికారికి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. రమణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నో యేండ్లుగా ఎన్నికలను నిర్వహించలేదని, వెంటనే నిర్వహించాలన్నారు.

News May 30, 2024

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.