Nalgonda

News May 3, 2024

నల్గొండ: వడదెబ్బతో రైతు మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని తిప్పలమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిని వివరాలు.. తోట జాన్ రెడ్డి వ్యవసాయ పనుల ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరారు. ఎండదెబ్బతో తీవ్ర అలసటకు గురై మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 3, 2024

భువనగిరి: ఆన్లైన్ మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు అనే లింక్‌ను వాట్సాప్‌లో పంపగా ఆ లింకును ఓపెన్ చేయగానే అతని అకౌంట్లో నుంచి సుమారు లక్ష రూపాయల నగదు కట్టయ్యాయని దీంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News May 3, 2024

భువనగిరి పార్లమెంట్ పరిధిలో నెరవేరని హామీలు

image

భువనగిరి పార్లమెంట్ పరిధిలో మూసీ కాలుష్యం సమస్య దశాబ్దాలుగా అలానే ఉండడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. HYD నుంచి ఘట్ కేసర్ వరకు వచ్చిన MMTS యాదాద్రి వరకు తెస్తామన్న పాలకుల హామీ కాగితాల్లోనే ఉంది. భువనగిరి నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఊసే లేదు. మల్కాపురంలో ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్, జిల్లాలో డ్రైపోర్టు హామీలు నేరవేర్చకపోవడంతో ఓటర్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

News May 3, 2024

భువనగిరిలో టఫ్ ఫైట్

image

భువనగిరి ఎంపీ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా.. పట్టునిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బూర దానిని సానుభూతిగా మలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల బలం లేకున్నా సత్తా చాటాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సీపీఎంలో కీలకంగా ఉన్న జహంగీర్‌ను ఆ పార్టీ బరిలో నిలిపింది.

News May 2, 2024

NLG: ‘న్యాయవిద్య కోర్సును ఏర్పాటు చేయాలి’

image

నల్లగొండ MG యూనివర్సిటీలో న్యాయవిద్య కోర్సును ఏర్పాటు చేయాలని కోరుతూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ రెడ్డికి విద్యార్థి నాయకులు వాడపల్లి నవీన్, శ్రీమన్ సందీప్, సంజయ్యలు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో న్యాయవిద్య కోర్సును ఏర్పాటు చేయాలని సుమారు 100 మంది విద్యార్థులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

News May 2, 2024

ఉమ్మడి నల్గొండలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నాంపల్లి, మునగాలలో 46.4 డిగ్రీలు, తెల్దేవరపల్లి, కేతేపల్లి, మాడులపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు.

News May 2, 2024

NLG: పోలింగ్ సమయం గంట పాటు పొడిగింపు: కలెక్టర్

image

నల్గొండ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, NLG పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

News May 2, 2024

నల్గొండలో రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్ 

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నారు. తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

News May 2, 2024

నేతలకు గుర్తుల గుబులు

image

2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.

News May 2, 2024

నల్గొండ: వడదెబ్బతో మహిళ మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో చిట్యాలకు చెందిన గోగికారి యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. కాగా రెండు రోజుల క్రితమే శాలిగౌరారం మండలం పెర్కకొండారానికి చెందిన అనిల్ కుమార్ వడదెబ్బతో చనిపోయాడు. రాబోయే రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుందని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.