Nalgonda

News May 28, 2024

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ హనుమంతు

image

యాదాద్రి జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంత్ ఆదేశించారు. వచ్చే జూన్ 3 నుంచి 11 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయానుకూలంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

News May 28, 2024

NLG: కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి సూసైడ్

image

కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ASI బలరాం రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆత్కూరి అనంతరావమ్మ భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఇటీవల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనోవేదనకు గురై అనంతరావమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెల్లెలు రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 28, 2024

అమెరికాలో యాక్సిడెంట్.. యాదగిరిగుట్ట యువతి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. యాదగిరిపల్లి కాలనీకి చెందిన కోటేశ్వర్‌రావు, బాలమణి దంపతుల కుమార్తె సౌమ్య(24) 2022లో అమెరికాకు వెళ్లి 4 నెలల క్రితం ఫోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీలో MS పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న సౌమ్య ఆదివారం మార్కెట్‌కి వెళ్లి వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందింది.

News May 27, 2024

NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 68.65 శాతం పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ 4 గంటలకు ముగియగా మొత్తం 68.65% పోలింగ్ నమోదయింది. సిద్దిపేట-69.82, జనగాం71. 60, హనుమకొండ– 71.21,వరంగల్-70.84, మహబూబాబాద్-69.52, ములుగు-74.54, భూపాలపల్లి-69.16, భద్రాద్రి,-68.05, ఖమ్మం-65.54, భువనగిరి-67. 45,సూర్యాపేట-70.62, నల్లగొండ-66.75 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 4,63,838 ఓట్లకు గాను 3,18,445 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

News May 27, 2024

NLG: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం

image

విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని 67 మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా TG, APల్లో బైకుల దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని తెలిపారు.

News May 27, 2024

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలలో 49.53% పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 606 పోలింగ్ కేంద్రాలలో 4,63,839 ఓట్లు ఉండగా ఇప్పటివరకు 2,29,762 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు.

News May 27, 2024

అమెరికాలో యాదాద్రి జిల్లా యువతి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్యగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

NLG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.

News May 27, 2024

NLG: 29.30% పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 605 కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

News May 27, 2024

NLG: గ్యాడుయేట్లు ఇలా ఓటేయ్యండి

image

☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు