India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీశ్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీశ్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.
ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా NLG- KMM -WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్‌పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్నరకం ధాన్యం పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ. 500 బోనస్ సెల్ ఇస్తామని ప్రకటించింది. కానీ దొడ్డు రకం వడ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేయాలా లేదా దొడ్డు రకం వరి సాగు చేయాలా అని అయోమయంలో ఉమ్మడి జిల్లాలోని రైతులు పడిపోయారు.
ఈనెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం ఉంటుందని కలెక్టర్, పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా HYDలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు. ఆ అధికారి సహకారంతో మైనర్‌ను నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను NLGకు తరలించినట్టు సమాచారం.
NLG-KMM-WGL పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. 27న పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోపాటు స్థానిక నేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్రులు బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలపై ఎఫెక్ట్ పడనుంది.
ఎన్నికల హడావుడి ముగియగానే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ సామాజికవర్గ నేత, సీఎం రేవంత్ రెడ్డి వర్గం కావడంతో ఆయనకు మినిస్టర్ పోస్ట్ దక్కే అవకాశం ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి, ఉత్తమ్ మంత్రివర్గంలో ఉండటం తెలిసిందే.
చింత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ గ్రామంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న చింత చెట్టు ఎక్కి చిగురు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య షాజిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.