India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 27న జరగవలసిన డిగ్రీ 2, 3, సెమిస్టర్ల పరీక్షలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.జి.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల దృశ్యా తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. 27న జరగవలసిన పరీక్షలు జూన్ 13న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాధడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలం నూకలవారిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. జ్యోతి పొలంలో గేదెలు మేపుతుండగా అక్కడికి వెళ్లిన నాగరాజు కర్రతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టమైన విధానాన్ని తీసుకురాకపోవడంతో కొన్ని చోట్ల పాత పద్ధతి ప్రకారం అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. కాంట్రక్టర్ మాత్రం మూసీ అవతలి వైపు ఉన్న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన కనగల్ మండలంలో వెలుగుచూసింది. SI రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు.. కనగల్‌కు చెందిన సత్తయ్య కుమారుడు నర్సింగ్ నితిన్(18) నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి EAPCET రాశాడు. కాగా ఇటీవల విడుదలైన EAP సెట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితిన్ ఆదివారం రాత్రి ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.
2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద జిల్లాకు 114 సీట్లు మంజూరైనట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 103 సీట్లు ST ఉపకులాలకు, 11 సీట్లు PTG (చెంచు) కులముల వారికి కేటాయించడం జరిగినది. మొత్తం సీట్లలో 33% బాలికలకు కేటాయిస్తూ (3వ తరగతి వారికి 50%) (5వ తరగతి వారికి 25%), (8వ తరగతికి 25%) సీట్లను తరగతి వారీగా కేటాయించినట్లు తెలిపారు.
నకిరేకల్‌లో నేడు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో MLA జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడని అన్నారు. అలాంటి వారిని చట్టసభల్లోకి పంపిస్తే ఎలా ఉంటుందో పట్టభద్రులంతా ఆలోచించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. BRS MLC అభ్యర్థి రాకేష్ రెడ్డికి పట్టభద్రులంతా తోడుగా నిలవాలన్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కరువును తీసుకువచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
భానుడి ప్రభావం గృహజ్యోతి వినియోగదారులపై పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,82,283 మంది ఉచిత కరెంట్ లబ్ధిదారులు ఉండగా ఏప్రిల్ నెలలో తీసిన లెక్కల ప్రకారం 4,73,314కి పడిపోయారు. ఒక్క నెలలోనే 8,969 మంది ఫథకాన్ని కోల్పోయారు. మేలో 4,60,864 మంది లబ్ధిదారులు మాత్రమే అర్హులయ్యారు. ఈ మూడు నెలల్లోనే 21,419 మంది పథకానికి దూరమయ్యారు. వాతవరణం చల్లబడడంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.