Nalgonda

News May 19, 2024

NLG: అదే ఉత్సాహంతో పని చేయాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్ గా ఉండాలన్నారు .

News May 18, 2024

NLG: ఐటిఐలలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

నల్గొండ జిల్లాలోని 4 ప్రభుత్వ, 10 ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐల కన్వీనర్/ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.

News May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు CPI(M) మద్దతు!

image

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.

News May 18, 2024

NLG: ఆ టేస్టే వేరు.. సాగర్ టు బంగ్లాదేశ్!

image

నాగార్జునసాగర్ చేపల టేస్టే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. సాగర్ వెనుక జలాలు, AMRP, ఏకేబీఆర్ ప్రాజెక్టులో లభించే చేపలు కొంచెం తియ్యగా, చప్పగా ప్రత్యేకంగా ఉండడంతో భోజన ప్రియులు ఈ చాపలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ చాపల కోసం బంగ్లాదేశ్ దేశ వ్యాపారస్తులు, అసోం వంటి రాష్ట్రాల వారు కొనుగోలు చేసుకుని వారి ప్రాంతాలకు తరలిస్తుండడంతో ఇక్కడి చేపలకు భలే గిరాకీ ఏర్పడింది.

News May 18, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

image

బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల, ఎస్ఐ కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలానికి చెందిన బాలిక(17) పారామెడికల్ కోర్స్ చదువుతోంది. తక్కెళ్ళపాడుకి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా నిందితుడు ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, ఫోన్ తీసుకొని దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకున్నట్లు తెలిపారు.

News May 18, 2024

NLG: లైంగికదాడి కేసులో బాలుడికి జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బాలుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి శిరీష శుక్రవారం తీర్పు వెలువరించారు. నల్గొండ మండలం ఆర్జాలబావికి చెందిన బాలుడు 2020 జూలై 19న అదే కాలనీకి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News May 18, 2024

నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న వైరస్

image

క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. బాధితులు నయమయ్యే వరకు ఔషధాలు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, వ్యాధిపై అవగాహన లేకపోవడంతో తిరిగి వ్యాధి తిరగపెడుతోంది. క్షయ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి జరుగుతోంది. జిల్లాలో మూడు నెలల్లో 282 కేసులు నమోదు అయ్యాయి.

News May 18, 2024

గుర్రంపోడు: ‘డీఎస్పీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ని పట్టభద్రులు గెలిపించాలి’

image

వరంగల్, ఖమ్మం, NLG పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మామిడి సైదయ్య (జగన్) పట్టభద్రుల ఓటర్లను కోరారు. శుక్రవారం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగాన్ని తీసివేయాలనే వాళ్ళు ఒకవైపు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు.

News May 17, 2024

NLG : మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

శ్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌ టేబుల్‌

image

మే 24న సెకండ్‌ లాంగ్వేజ్‌, 25న ఇంగ్లిష్‌ పేపర్‌, 28న మ్యాథ్స్‌-1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌-1 పరీక్షలు, 29న మ్యాథ్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు, 30న ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-1, కామర్స్‌-1 పరీక్షలు, జూన్‌ 1న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, బ్రిడ్జికోర్స్‌ మ్యాథ్స్‌-1 పరీక్షలు, జూన్‌ 3న మోడరన్‌ లాంగ్వేజీ-1, జాగ్రఫీ -1 పరీక్షలు జరగనున్నాయి.