Nalgonda

News April 25, 2024

రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు: ఎస్పీ చందన దీప్తి

image

అతి వేగం అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకూడదని,
రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. వాహనదారులు అతివేగం అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని సూచించారు.

News April 25, 2024

NLG: ఏప్రిల్ 30 వరకు పెన్షన్ల పంపిణీ

image

నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పెన్షన్దారులు పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.

News April 25, 2024

NLG: 22 మంది నామినేషన్లు దాఖలు

image

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం NLG పార్లమెంటు స్థానానికి 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. BRS తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు, బీజేపీ తరఫున నూకల నరసింహారెడ్డి 2 సెట్లు, BJP అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓ సెట్, కాంగ్రెస్ తరపున రఘువీర్ కుందూరు 3 సెట్లు, కుందూరు జానారెడ్డి 2 సెట్లు, డీఎస్పీ తరఫున తలారి రాంబాబు ఓ సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.

News April 25, 2024

కంచర్ల కృష్ణారెడ్డి ఆస్తులు@ రూ.82 కోట్లు!

image

BRS NLG ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. తన పేరుపై రూ.82.6కోట్ల స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయన్నారు. తన భార్య పేరిట రూ.1.6 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ.88వేలు, భార్య వద్ద రూ.18,600 ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.96లక్షల డిపాజిట్లు ఉన్నట్లు చూపారు. భార్య పేరున 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయన్నారు.

News April 25, 2024

నల్గొండ: ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

image

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గణపురం స్టేజీ వద్ద మెట్రో వాటర్ దిమ్మెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

NLG: ఇంటర్ ఫలితాలు.. 470కి 467 మార్కులు

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నల్గొండలోని గాంధీనగర్‌కు చెందిన గండమళ్ల సన్‌హిత్ దేవ్ సత్తా చాటాడు. శ్రీను ప్రసన్న దంపతులకు చెందిన సన్‌హిత్ ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. దీంతో సన్‌హిత్‌కు బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

News April 25, 2024

సెకండియర్ ఫలితాల్లో 10వ స్థానంలో నల్గొండ

image

సెకండియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 68.45 శాతంతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. 11,474 మందికి 7854 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లా 62.74 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. 6,063 మందికి 3804 మంది పాసయ్యారు. యాదాద్రి భువనగిరి 62.64 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 4446 మందికి 2785 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో నల్గొండ

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 57.2 శాతంతో రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. 11,555 మందికి 6,610 మంది పాసయ్యారు. యాద్రాద్రి భువనగిరి 51.04 శాతంతో 26వ స్థానంలో నిలిచింది. 4,561 మందికి 2,328 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లాలో 49.42 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 6,637 మందికి 3,280 మంది పాసయ్యారు.

News April 25, 2024

నేడే ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి నల్గొండ నుంచి ఎంత మంది అంటే

image

నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. NLG జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 32,895 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 16,602 మంది విదార్థులు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 12,559 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 25, 2024

NLG: MGUకు 28 నుంచి సెలవులు

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ MGU రిజిస్ట్రార్ అల్వాల రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం, ఇతర అడ్మినిస్ట్రేషన్ విభాగాలు యథావిధిగా పని చేస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.