Nalgonda

News April 25, 2024

NLG: MGUకు 28 నుంచి సెలవులు

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ MGU రిజిస్ట్రార్ అల్వాల రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం, ఇతర అడ్మినిస్ట్రేషన్ విభాగాలు యథావిధిగా పని చేస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.

News April 25, 2024

నేడు నల్గొండకు మాజీ సీఎం KCR

image

మాజీ సీఎం KCR తన బస్సు యాత్రను నల్గొండ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోల్లో KCR పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో పాల్గొనున్నారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.

News April 25, 2024

మిర్యాలగూడలో ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర

image

మిర్యాలగూడ పట్టణంలో వీరహనుమాన్ శోభాయాత్రను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభయాత్ర కాషాయ జెండాలు చేతపట్టి భక్తులు భారీ ఆంజనేయ విగ్రహంతో పట్టణంలో డిజే భక్తి గీతాల మధ్య నృత్యాలు, కోలాటాలు ఆడుతూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్, రేపాల పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

News April 25, 2024

నా 25 ఏళ్ల శ్రమ ఫలించింది: చామల

image

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఫామ్ తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అందజేశారు. తన 25 ఏళ్ల కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడతానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు.

News April 24, 2024

నల్గొండలో వారే కీలకం

image

NLG పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో వారే అత్యధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారి తీర్పే కీలకం కానుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,22,521 అందులో పురుషులు 8,43,496, మహిళలు 8.78,856, ట్రాన్స్ జెండర్లు 169 మంది ఉన్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరింటిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

News April 24, 2024

కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా డిపాజిట్ రాదు: మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా భువనగిరి, నల్గొండలో డిపాజిట్ దక్కదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని త్వరలో తండ్రీ కొడుకులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News April 24, 2024

సూర్యాపేట: చిన్నారులకు నాయనమ్మ చిత్రహింసలు

image

ముగ్గురు చిన్నారులను నాయనమ్మ చిత్ర హింసలకు గురి చేసి కాల్చి వాతలు పెట్టిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి మండలం రాయినిగూడెం వద్ద ముగ్గురు పిల్లలు ఉండగా వారిని స్థానికులు గుర్తించి వివరాలు అడిగారు. నాయనమ్మ సీతమ్మ తమని కొట్టి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిందని చిన్నారులు ఆరోపించారు. వారిని పాలకీడు మండలం గూడుగుండ్ల పాలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ నారాయణరెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తారా..?

image

ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్‌ పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని, నల్గొండ నుంచి ఉత్తమ్ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తానని సవాల్ విసురుకుంటున్నారు. దీంతో వీరు దివంగత ఎంపీ రావి నారాయణరెడ్డికి వచ్చిన రికార్డును బ్రేక్​ చేస్తారా అనే చర్చ మొదలైంది. రావికి 1952లో 2,72,280మెజార్టీ వచ్చింది.

News April 24, 2024

నల్గొండ వర్సెస్ భువనగిరి

image

నల్గొండ, భువనగిరి ​స్థానాలు కాంగ్రెస్​ నేతలకు సవాల్​గా మారాయి. నల్గొండ వర్సెస్ ​భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్​ భావిస్తోంది. భువనగిరిలో 4లక్షల మెజార్టీ సాధించాలని ఆ బాధ్యత రాజగోపాల్​రెడ్డిపైనే ఉందని మంత్రి వెంకట్​రెడ్డి చెప్పారు. అటు నల్గొండలో దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామని ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఇద్దరు మంత్రులు భారీ మోజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తిగా మారింది.

News April 24, 2024

NLG: సైదిరెడ్డి ఆస్తులు.. అప్పులు ఇవే..!

image

NLG బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ.31,33,55,479గా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా రూ.6,10,9131 అప్పులు.. తన చేతిలో రూ.45వేల నగదు ఉన్నట్లు చెప్పారు. HYD బంజారాహిల్స్ DCCBలో రూ.7,97,650, యూనియన్ బ్యాంకులో రూ.3,60,940, SBIలో రూ.18,17,072, ICICIలో రూ.10లక్షల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కెనడాలో రెండు ఇళ్లు ఉన్నాయని తెలిపారు.