India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుంగతుర్తి మండలం అన్నారు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దుర్గమ్మ తల్లి చీర వేలం పాటలో ముస్లిం సోదరులు చీరను దక్కించుకున్నారు. ఈ మేరకు ఎండి.సిద్ధిక్ భాష, ఆజం అలీ పాల్గొని చీరను రూ.4100లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో చాలామంది పోటీపడి వేలం హోరాహోరీగా సాగింది. ఈ సంఘటన కులమత సామరస్యతకు ప్రత్యేకంగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు.
నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.
గోపాలమిత్రలు ఆపదలో ఉన్న పశుపోషకులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం వీరు వెళ్లి పశువులకు పశువైద్యం అందిస్తున్నారు. పండగ వేళల్లో సైతం తమ సేవలను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని గోపాలమిత్రల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ కోరారు.
బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామ రోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుజుర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తోకల మహేశ్ స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడు. దీంతో దసరా పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోదాడ మండలం బాలాజీ నగర్‌కు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు శివ ప్రియాంక ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గిరిజన పేద కుటుంబానికి చెందిన శివ ప్రియాంక తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విద్యను అభ్యసిస్తూ మొదటి సారి డీఎస్సీ పరీక్షలు రాశారు. కాగా, శివ ప్రియాంక ఎస్టీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించారు. దీంతో పలువురు గ్రామస్థులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని, విజయాలకు చిహ్నమే విజయదశమి పండుగ అని, ఈ విజయదశమి అందరిలో శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని పెంపొందించాలని, దుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏళ్ల తరబడి రోడ్లు ఇలానే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని, గుంతలుగా మారిన రహదారులపై ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండలంలో మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు. మీ గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంధంవారిగూడెం వద్ద రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజను నిర్వహించారు. ఇంగ్లిష్, తెలుగు మీడియలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.