Nalgonda

News April 18, 2024

లోక్‌సభ ఎలక్షన్స్.. భువనగిరి బీ ఫామ్ అందజేత

image

ధర్మ సమాజ్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొంగరి లింగస్వామి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆయనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తూ బీ ఫామ్ అందించారు. లింగస్వామి స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. టికెట్ కేటాయించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

News April 18, 2024

అందని ద్రాక్షలా..మూగజీవాలకు పశువైద్యం

image

ఉమ్మడి జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాల్లోని పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. సీజనల్‌ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

News April 18, 2024

మర్రిగూడ మీదుగా వెళ్ళనున్న రైలు మార్గం

image

డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 18, 2024

NLG: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కనగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన చెనగోని కావ్య అనే యువతి రెండు సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. తల్లి చెనగోని లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 18, 2024

NLG: గురుకులాలను పట్టించుకోని అధికారులు

image

నల్గొండ జిల్లా పరిధిలో 28గురుకులాలు, 5 డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్‌ శ్రీరాముల శ్రీనివాస్‌ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్‌ చేయడంపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

News April 18, 2024

రోడ్డుప్రమాదంలో BRS నేత మృతి ఘటన.. కేసు నమోదు

image

నల్గొండలో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రఘుబాబు కారు తగిలి <<13072708>>బీఆర్ఎస్ నేత జనార్ధన్ రావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అజాగ్రత్తగా కారు నడిపి రఘుబాబు తన భర్త మృతికి కారణమయ్యారని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై నాగరాజు వెల్లడించారు.

News April 18, 2024

ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

image

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి అన్నారు. ‘ఘటనపై విచారణ కమిటీని నియమించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పొరుగు సేవల కింద ఉద్యోగం ఇస్తాం. ప్రాథమిక విచారణ అనంతరం ప్రిన్సిపల్ శ్రీరామ్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశాం’ అని వివరించారు.

News April 18, 2024

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ చందనా దీప్తి

image

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.

News April 17, 2024

అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలోనే

image

రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిడమనూరులో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 17, 2024

రోడ్డు ప్రమాదం.. బీఆర్ఎస్ నేత మృతి

image

నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ బైపాస్ లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19వ వార్డుకు చెందిన నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు సంధినేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.