India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామంలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఆంబోతు శుక్ర నాయక్(40 )ను గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ఎక్సైజ్ శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు జిల్లా పోలీసు కార్యాచరణ రూపొందించి, నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 693 మంది పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు.
ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీని చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటమి భయంతో రైతుబంధును ఆపించాయని , రైతుబంధు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.
పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో భువనగిరి పార్లమెంట్కు చెందిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయి ట్రైనర్స్ నర్సింహ్మారెడ్డి మైక్రో అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు.
రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్‌తో తాను NLG- WGL- KMM గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బరిలో నిలుస్తున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు.
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసిన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జగ్గయ్యపేట తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్.. రాముడు, సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మోకిలా PSలో తాము అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకటేశ్, రాజచంద్ర, యాదయ్య, కృష్ణ, హరినాథ్, లింగం, కర్ణాకర్ చారి, కృష్ణ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.