Nalgonda

News October 3, 2024

యాదాద్రిలో నేటి నుంచి దేవి శరన్నానవరాత్రులు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం కొండపైన గల పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో నేటి నుంచి 9రోజులపాటు దేవి శరన్నవరాత్రులను‌ ఆలయాధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ‌ 9 రోజులు దేవి శరన్నవరాత్రుల్లో భక్తులు‌ రూ.1,116 చెల్లించి‌ దేవిపూజల్లో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

News October 2, 2024

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్

image

నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ప్రత్యేక అధికారిగా పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. గతంలో ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.

News October 2, 2024

NLG: సర్వేకు వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకు జిల్లాలో వెంటనే బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లతో కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఏర్పాటు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News October 2, 2024

భువనగిరి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్ష సమావేశం

image

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 1, 2024

NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్‌పై దాడి: జగదీశ్ రెడ్డి

image

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.

News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన నల్గొండ జిల్లా

image

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో నల్గొండ జిల్లా వాసులు సత్తా చాటారు. పిల్లి సైదులు(గట్లమల్లేపల్లి)1వ ర్యాంక్ పీఈడీ, పల్లెభవాని (మునుగోడు) జీవశాస్త్రం1వ ర్యాంక్, హనుమంతు అనిల్ (త్రిపురారం) వ్యాయామం 2వ ర్యాంక్, ఎండీ కలీమెద్దీన్ (చిట్యాల) హిందీ 2వ ర్యాంక్, విజయేంద్రచారి (హాలియా) సోషల్ 4వ ర్యాంక్, వలిశెట్టి యాదగిరి (ఆకారం) సోషల్ 5వ ర్యాంక్ సాధించారు.

News October 1, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News October 1, 2024

నల్లగొండ: బతుకమ్మ, దసరా సందర్భంగా 639 అదనపు బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల నుండి సుమారు 639 బస్సులను అదనంగా నడుపుతున్నామని ఆర్ఎం M. రాజశేఖర్ సోమవారం తెలిపారు. అక్టోబర్ 1 నుండి 11 వరకు, తిరుగు ప్రయాణం కోసం 13 నుండి 17 వరకు బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన, శుభప్రదమైన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు.