India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
మునుగోడు మండలం చోల్లేడు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం చేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మునుగోడుకు చెందిన రేవల్లి నాగరాజు, మర్రిగూడ మండలం నర్సిరెడ్డి గూడెంకి చెందిన కీలకత్తి ఆంజనేయులు మృతి చెందారు. మరో వ్యక్తి బొమ్మనగోని నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి 108 ద్వారా తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఇసుక వాహనం’ విధానం ద్వారా గృహ వినియోగ అవసరాల కోసం సరైన ధరలకు ఇసుక అందించేందుకు జిల్లాలో ఇసుక విధానం అమలు చేయనున్నట్లు కలెక్టర్ ట్లు తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గృహ అవసరాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లయితే ట్రాక్టర్ల ద్వారా ఇసుక పొందొచ్చని వివరించారు. ఆన్లైన్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తహశీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలకు పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ పదవులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లుగా, పలువురిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించింది. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి ఇంధనం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవులు దక్కాయి.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో మొబైల్ షాప్ వ్యాపారుల మీద రాజస్థాన్ మార్వాడి వ్యాపారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నల్గొండ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా గురువారం జిల్లా కేంద్రంలోని అన్ని మొబైల్ షాపులు బందు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురానానికి చెందిన సాయి (25), శైలజ(30) బట్టలు ఉతకడానికి సమీపంలోని ఎడమ కాల్వకు వెళ్లారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు శైలజ, సాయి పడిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసిన నీటీ ప్రవాహనికి కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
దామరచర్ల మండలంలో జరిగిన <<14191461>>హత్యాచార <<>>కేసును పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాల ప్రకారం.. పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, బావ కాంత్రి కుమార్ అదే తండాకి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, వీరికి వారి తల్లి బుజ్జి సహయపడింది. అక్కడే కాపలాగా ఉండగా, ఇద్దరు కొడుకులు గొంతునొక్కి చంపి చెట్టుకు వేలాడదీశారు. తర్వాత యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్‌ను NLG DSB నుంచి SRPTకి, వెంకటేశ్వర్లును NLG VR నుంచి SRPTకి, కృష్ణయ్యను MLG టూ టౌన్ నుంచి మాడుగులపల్లికి, శోభన్ బాబును మాడుగులపల్లి నుంచి NLG VRకు, విజయ్ కుమార్‌ను వేములపల్లి నుంచి నల్గొండకు, సందీప్ రెడ్డిని NLG 1-టౌన్ నుంచి MLG రూరల్‌కు బదిలీ చేశారు.
Sorry, no posts matched your criteria.