Nalgonda

News April 11, 2024

ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

image

ఉమ్మడి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో NLG, SRPT, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రార్ధనలు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

News April 11, 2024

NLG: కళాశాలలో ప్రవేశాలకు రేపే ఆఖరి రోజు

image

ఉమ్మడి జిల్లాలోని మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ గురుకుల జూనియర్ బాలికల, బాలుర కళాశాలలు, డిగ్రీ మహిళా, పురుషుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాలయాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రవేశపరీక్ష ద్వారా సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు http///www.mjptbcwreis. telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.

News April 11, 2024

NLG: మిగిలింది నాలుగు రోజులే

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నలగొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.

News April 11, 2024

BREAKING: సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేట మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయినిగూడెం గ్రామం వద్ద స్కూటీని తప్పించబోయిన ఎర్టీగా వాహనం చెట్టును ఢీ కొట్టడంతో స్పాట్‌లో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

NLG: డేంజర్ బెల్స్.. అడుగంటుతున్న సాగరం!

image

తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జునసాగర్ అడుగంటుతోంది. డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఆయకట్టు పరిధిలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తాగునీటి కష్టాలు కూడా పొంచి ఉన్నాయి.

News April 11, 2024

NLG: గర్భం దాల్చిన తొమ్మిదో తరగతి బాలిక

image

తొమ్మిదో తరగతి చదివే బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన మోతె మండల పరిధిలో జరిగింది. SI యాదవేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ తండాకు చెందిన 14ఏళ్ల బాలికను అదే తండాకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. అనారోగ్యానికి గురైన బాలికను వైద్యులు పరీక్షించగా. 3 నెలల గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

News April 11, 2024

NLG: తనిఖీలలో రూ. 2.48 కోట్లు స్వాధీనం

image

లోక్ సభ ఎన్నికల నియమావళితో అధికార యంత్రాంగం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు జిల్లా సరిహద్దు చెక్ పోస్టులతో పాటు ఎస్ఎస్‌టీ కేంద్రాల ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.2,48,58,597 నగదుతో పాటు 13.406 గ్రాముల బంగారం ఆభరణాలు, 3,453 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవ దృవపత్రాలు చూపిన వారికి 24 గంటల్లో తిరిగి నగదు, బంగారు వస్తువులను అందజేస్తున్నారు.

News April 11, 2024

నల్గొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరిక

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ఇతర నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల నియమావళి కింద పరిగణించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. కుల, మత, వర్గ భాషాపరమైన అంశాల ఆధారంగా రెచ్చగొట్టడం, ప్రేరేపించడం లాంటివి చేస్తే సహించబోమని హెచ్చరించారు.

News April 11, 2024

36,596 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 36,596 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా.. రైతుల ఖాతాలలో 12 కోట్ల 66 లక్షల రూపాయల జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరిచందన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

News April 11, 2024

లోక్ సభ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ హరిచందన

image

NLG:లోక సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం,రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.బుధవారం ఆమె మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని,ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను, ఈవీఎంల కమీషనింగ్ రూములను పరిశీలించారు.