Nalgonda

News September 19, 2024

3 రోజుల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్‌కు సంబంధించిన నాలుగో పంపు మరమ్మతులు పూర్తయ్యాయని, 3 రోజుల్లో ఈ పంపు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాలువల్లో నీరు సమృద్ధిగా పారుతుందని రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

News September 19, 2024

షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

image

మహిళాలు, విద్యార్థినులకు అండగా జిల్లాలో షీ టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా జిల్లాలో షీ టీమ్స్ అధ్వర్యంలో 42 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి, 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 13 ఫిర్యాదులు స్వకరించినట్లు చెప్పారు. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 45 కేసులు నమోదు చేశామన్నారు. వేధింపులపై 87126 86056 ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.

News September 19, 2024

యాదాద్రి ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు హనుమంత్‌తో ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.

News September 18, 2024

NLG: రోడ్డు ప్రమాదం.. మహిళా కానిస్టేబుల్ మృతి

image

సాగర్ సమీపంలో <<14133782>>రోడ్డుప్రమాదంలో<<>> చనిపోయిన మహిళను కానిస్టేబుల్ శ్రావణిగా గుర్తించారు. ఆమెది గద్వాల జిల్లా జోగులాంబ గ్రామం. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శ్రావణికి ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భర్త వద్దకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News September 18, 2024

దేవరకొండ: మైనారిటీ స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

image

దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామపరిధిలో ప్రభుత్వ మైనార్టీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు సమాచారం. నిన్న సాయంత్రం 6:00 గం.ల వరకు మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం స్కూల్ సిబ్బంది వెతికి ఫలితం లేకపోవడంతో.. స్కూల్ ప్రిన్సిపల్ దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News September 18, 2024

యాదగిరిగుట్ట: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన ఏసీపీ

image

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, సీఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి

image

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News September 18, 2024

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’

image

రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.

News September 17, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద స్వల్పంగా పెరింది. 2 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి 24,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 68,327 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 22,366 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.7462 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.