India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు.
నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.
దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు ఎట్టకేలకు ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 33 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. NLGలోని 17 మోడల్ స్కూళ్లలో 290 మంది, SRPT జిల్లాలో 9 మోడల్ స్కూళ్లలో 144 మంది, యాదాద్రి BNG జిల్లాలో 7 మోడల్ స్కూల్స్ ఉండగా 126 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 560 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగించింది.
స్కూల్ కాలేజీలో ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే100కు కాల్ చేయాలని షీటీం ఏఎస్‌ఐ షరీఫ్ ప్రభాకర్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓ పాఠశాలలో షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడ పిల్లలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి కేసు బుక్ అయితే జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతారని విద్యార్థులకు తెలిపారు.
నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ CC TV కెమెరాలతో పాటు ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.