Nalgonda

News September 14, 2024

NLG: ‘గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి’

image

NLG జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసి రివర్, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలండి అడవిదేవుల పల్లి, కొండ భీమనపల్లి, డిండి పోలీస్ పికెట్లు, హెడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

News September 14, 2024

మదర్ డైరీ ఛైర్మన్‌గా మధుసూదన్ రెడ్డి

image

రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News September 14, 2024

నల్లగొండ: ఇంటర్ విద్యతో ఎంజీ యూనివర్సిటీలో PG కోర్సు

image

ఇంటర్ విద్యతో నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (PG ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చని ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఈ కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( CPGET – 2024) ద్వారా అర్హత సాధించి యూనివర్సిటీని ఎంచుకోవాలని సూచించారు.

News September 14, 2024

SRPT: కొడుకును హత్య చేసిన తండ్రి అరెస్ట్: డీఎస్పీ

image

మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటనలో తండ్రి పంతులను రిమాండ్‌కు పంపినట్లు సూర్యాపేటలో DSP రవి తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) మండలం బాపూజీతండాకు చెందిన బాణోత్ కిరణ్ ఈ నెల 11న రాత్రి మద్యం తాగి వచ్చిన కిరణ్ తండ్రితో ఘర్షణకు దిగి దాడి చేశాడు. ఆవేశానికిలోనైన తండ్రి గొడ్డలితో కిరణ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. గ్రామీణ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ సైదులు అన్నారు.

News September 14, 2024

సూర్యాపేట: ‘ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారు’

image

సూర్యాపేట జిల్లా యాతవకిళ్లలో ఆకతాయిలు అర్ధరాత్రి ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారి వివరాలిలా.. ఓ వర్గానికి చెందిన వినాయకుడి వద్ద భజన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు పూజా కార్యక్రమాలను చేయకుండా మరో వర్గం వారు అడ్డుకుంటున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News September 14, 2024

NLG: పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యం సాధించవచ్చు: జిల్లా కలెక్టర్

image

పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం అన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను, తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూంలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు.

News September 13, 2024

మదర్ డైరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా

image

ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 13, 2024

నల్లగొండ: ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతు మొగ్గు

image

మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్‌ పామ్‌ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. దీనిలోనే భాగంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆయిల్ పామ్‌ సాగు గమనియంగా పెరుగుతుంది. దీనిపై రైతులు కూడా మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఫామ్ చెట్లు పెంచిన రైతులు అధిక లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News September 13, 2024

ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్

image

ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

News September 13, 2024

ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్

image

ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.