India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు రైతులు బలవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం నోటికాడి బుక్కను లాక్కోవడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం చెప్పిన టైమ్‌కు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ‘అకౌంట్లలో డబ్బులు పడ్తున్నాయని రైతులు సంతోషపడే లోపలే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం’ అని మంత్రి అన్నారు
NLG:పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు,మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పి చందనా దీప్తి హెచ్చరించారు.జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను ప్రభావితం చేస్తే చర్యలు తప్పమన్నారు.
WGL- KMM- NLG పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 6వ రోజు మంగళవారం 14 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్‌కి నామినేషన్లను సమర్పించారు.
అవినీతి నిలయాలుగా మారాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ప్రభుత్వం త్వరలో ఎత్తివేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు 15 చెక్‌పోస్టులు ఉండగా వాటిలో 3 ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. KDD, వాడపల్లి, అద్దంకి- NKP రహదారి, నాగార్జునసాగర్ వద్ద రవాణా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మహిళల పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. NLG లోక్ సభ పరిధిలో 17,18,954 ఓట్లకుగానూ 8,76,538 మహిళా ఓటర్లున్నారు. BNG లోక్ సభ పరిధిలో 17,98,704 ఓట్లకు గాను 9,04,250 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. ఈ రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థుల తల రాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లకే ఉందన్న
చర్చ జోరుగా సాగుతుంది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న పాలకూరి అశోక్ కుమార్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే GO-46 బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా జూన్‌లో నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ తక్షణమే ప్రకటించేలా పోరాడుతానని పేర్కొన్నారు.
పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేయగా.. ఈరోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
యాదగిరిగుట్టకు ఈ నెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని కోరుతూ.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముందుగా పట్టణంలో బైక్ ర్యాలీ ఉంటుందని, అనంతరం కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారని అన్నారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారుు.
జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగుతున్న మామిడి, అరటి తోటల పై ఈదురుగాలుల ప్రభావం పడింది. జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు ఎస్, పెన్పహాడ్, మద్దిరాల, నాగారం తదితర మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలకు నష్టం చేకూరింది. మామిడికాయలు తెంపే సమయంలో ఈదురుగాలులు వీచడంతో కాయలు అధికంగా నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Sorry, no posts matched your criteria.