India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.
RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.
NLG: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. హలియాకు చెందిన కృపారాణి అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 4న ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం 5 రోజులు వేచి చూశారు. దీంతో కడుపులోనే శివువు మృతి చెందిందని భాదితులు ఆరోపించారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. గెలిస్తే రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19నుంచి 21 వరకు ఉ.9 నుంచి రా.9గం.వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మొత్తం 50కి పైగా కళాశాలలు ఉన్నాయి. 15వేల మందికిపైగా చదువుకుంటున్నారు.
భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను పూర్తి జాగ్రత్తగా రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్, సహాయ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాగర్ గేట్లు, జల విద్యుత్ కేంద్రం, ఎత్తిపోతల జలపాతం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల బాలుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో జరిగింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత పుట్టిన బాబు మృతితో బాధితులు తీవ్ర రోదనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.