India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG: ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఇప్పటికీ వివిధ కేసులలో ఉన్న పాత నేరస్తులను, రౌడీషీటర్స్ ను 512 కేసులలో 943 మందిని బైండోవర్ చేయడం జరిగిందని వెల్లడించారు.జిల్లావ్యాప్తంగా లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి 116 ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు
NLG: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా రూ.14.46 కోట్ల నగదు మద్యం ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎస్పి చందనా దీప్తి వెల్లడించారు.ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు గాను కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో (6) ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పలపల్లి బాలమల్లు మేత కోసం పాడి గేదెను తన వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో ప్రారంభమై వర్షం పడుతుండడంతో ఊరు ప్రక్కనే ఉన్న తన దొడ్డిలో ఆగగా పిడుగు పడి మృతి చెందాడు.
అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతేపల్లి స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ పి.మహేష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28న కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వాహనంలో 9 బీర్లు ఉండగా వారిని కేసు నమోదు బెదిరించి చేస్తామని చెప్పి పెట్రోల్ బంకు ద్వారా రూ.6 వేలు ఫోన్ చేయించుకోవడంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
నల్లగొండలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు పని ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం శ్రమకు తగిన వేతనం లభించడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. పని భారం తగ్గించాలని కోరుతున్నారు.
భానుడి ప్రతాపానికి బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది. దాదాపు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల బీర్లు లేవు అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా బీరు ఉత్పత్తి కాకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు వైన్ షాపుల ముందు నో బీర్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లను తాగి ఉపశమనం పొందాలనుకున్నా వారికి నిరాశే కలుగుతుంది.
నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. చందంపేట మండలం తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం , మాడ్గులపల్లి, నాంపల్లి, తిప్పర్తి మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి మండలం కోదాండాపురం, నిడమనూరు, హాలియా, ఇబ్రహీంపేట, కనగల్ తదితర మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ,ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.
Sorry, no posts matched your criteria.