India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం 3 విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయి చెల్లించకపోవడంతో మూసివేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 65 ప్రైవేట్ కళాశాలలు నేటి నుంచి మూతపడనున్నాయి. రేపటి నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో నేటి నుంచి మళ్లీ పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు.

బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం సిస్టర్న్, కుడి, ఎడమ డిస్ట్రిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్నట్లు తెలిపారు.

భువనగిరి పట్టణం నల్గొండ రోడ్లో నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించగా మృతుడు బిహార్‌కు చెందిన వలస కూలీ ఎండి శేష్మిఆలంగా గుర్తించారు. యువకుడిది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. భువనగిరిలో 4 ఏళ్ల నుంచి మృతుడు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రేపు ఎంజీయూలోని ఆర్ట్స్ బ్లాక్ సెమినార్ హాల్లో ఉదయం 9:30 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి తెలిపారు. 10th, ఇంటర్, ఏదైనా UG, ఏదైనా PG, B.Tech & M.Tech పాస్ అయిన విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. జాబ్ మేళాలో ఐటి, నాన్ ఐటికి సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థలు, ఫార్మసీ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16,543 మంది అభ్యర్థులకు గాను, 9,232 మంది హాజరు కాగా, 7,311 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 55.8 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు. పరీక్షలకు విధులు నిర్వహించిన అధికారులకు, పోలీసు అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.

NLG జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత మూడు రోజుల క్రితం 27 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 20 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం 8 గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. వృద్ధులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల సమయం దాటిందంటే చాలు చలి మొదలవుతుందని స్థానికులు తెలిపారు.

నల్గొండ జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నల్లగొండలో 60, మిర్యాలగూడలో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్నింగ్ పేపర్ -1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం (పేపర్ 2) హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. రేపు ఉదయం పేపర్-3 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసినందు వల్ల ముగ్గురు వైద్య విద్యార్థునులు, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 2వ సంవత్సరం విద్యార్థి ఒక నెల, ఇద్దరు 4వ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థినుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం.

గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్‌పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.

జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.