India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గం నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పది సంవత్సరాలుగా బునాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెల్త్ టూరిజం, జూపార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్తగా 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయుటకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. త్వరలో రాష్ట్రంలోని 10 నగరాల్లో 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండలో-3, సూర్యాపేటలో-3ఎఫ్ఎం స్టేషను ఏర్పాటు చేయనున్నారు. మాతృభాషలో స్థానిక కంటెంట్ ను పెంచడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు తెలిపారు.
సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలన్నారు.
ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కొండమల్లేపల్లిలో గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ గిరిబాబు, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.