India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లా లోయపల్లికి చెందిన బూడిద బాలనర్సయ్య 2016లో నల్గొండ జిల్లాకు చెందిన మతిస్థిమితంలేని ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మెడలో బలవంతంగా తాళికట్టి పెళ్లి అయినట్లు నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000జరిమానా విధించింది.
పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో గొడవలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియా నందు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
నల్గొండ పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోకసభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో సమావేశమయ్యారు.
బైకుని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన ఘటన నార్కట్ పల్లి మండలం ఓసీటీఎల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండి.జానీ మియా ఏపీ లింగోటం నుంచి ఓసీటీఎల్ వైపు తన బైక్‌పై వస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. అతడు రోడ్డు పక్కకు పడడంతో తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులు పేర్లు చెబుతూ అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుండి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
నల్గొండ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 9 మంది అభ్యర్థులు నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరగబోయే ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. ఉమ్మడి జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల తుది జాబితాను విడుదలపై రిటర్నింగ్ అధికారులు దృష్టి సారించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ప్రధాన పార్టీలు చివరి వరకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
భువనగిరి పార్లమెంట్ స్థానానికి 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 మంది నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. బెల్టు షాపులన్నింటినీ మూసివేయడంతోపాటు నిరంతర నిఘా ఏర్పాటుచేసి మద్యం ప్రవాహం ఓటర్లపై ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 140 కేసులను నమోదు చేయడంతోపాటు రూ.26.25 లక్షల విలువ కలిగిన 44వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.
NLG, BNGRస్థానాల్లో నలుగురు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేరు. సోషలిస్టు పార్టీ తరఫున సుభద్రరెడ్డి నల్గొండ, భువనగిరి స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థినులుగా పాలకూరి రమాదేవి, పోతుల ప్రార్థన బరిలో నిలవగా.. భువనగిరి నుంచి జంగా సుజాత పోటీలో ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నందున పోరులో ఎంత మంది ఉంటారో తేలనుంది.
Sorry, no posts matched your criteria.