Nalgonda

News April 29, 2024

NLG: అక్కడ అత్యధికం.. ఇక్కడ అత్యల్పం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మాడ్గులపల్లి మండల కేంద్రంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా చింతపల్లి మండలం గోడకొండలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. 

News April 29, 2024

చౌటుప్పల్‌‌కు మోదీ రాక..!

image

నల్గొండ, భువనగిరి స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్‌లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్‌ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

News April 29, 2024

రఘువీర్‌ 44, బూర 65

image

నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు. భువనగిరి బీజేపీఅభ్యర్థి బూరనర్సయ్య 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. నల్గొండ బీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి 53 ఏళ్లు, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి 49, భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ 47, బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లేష్‌ 59, సీపీఎం జహంగీర్‌ 51 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు.

News April 28, 2024

తనిఖీల్లో రూ.11.7 కోట్లకు పైబడి నగదు, మద్యం స్వాధీనం: SP

image

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో బాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తూ రూ.11.7 కోట్లకు పైబడి నగదు, మద్యం, ఇతర వస్తువుల, స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని, వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్ పాండ్, సాగర్ వద్ద అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నామన్నారు.

News April 28, 2024

హుజూర్‌నగర్: వడదెబ్బతో వృద్ధుడు మృతి

image

హుజూర్‌నగర్: ఎండల తీవ్రత పెరిగిపోయిన క్రమంలో స్థానిక 13వ వార్డులో వృద్ధుడు వడదెబ్బ తగిలి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 13వ వార్డులో నివాసం ఉంటున్న ధార అంజయ్య (70 ) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బ తగలడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News April 28, 2024

కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం:రాజగోపాల్ రెడ్డి

image

కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి సెగ్మెంట్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందన్నారు.

News April 28, 2024

సూర్యాపేట: ‘100 మంది మృతి.. 200 మంది దివ్యాంగులుగా మారారు’

image

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ.. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని తమ విచారణలో తెలుస్తోందన్నారు. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దని సూచించారు.

News April 28, 2024

భువనగిరిలో CPM పోటీ నుంచి తప్పుకొంటుందా!

image

BNG లోక్‌సభ స్థానంలో CPM పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. శనివారం HYDలో సీఎం రేవంత్ రెడ్డితో CPM రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపారు. సీఎంతో సమావేశం అనంతరం CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మతోన్మాద బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు CPM మద్దతు ఇస్తుందని ప్రకటించారు. BNGలో పోటీ నుంచి తప్పుకొని తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని CM కోరారు.

News April 28, 2024

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.డి అంజాద్ అలీ ఖాన్ గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ఎంఇఓ గోపాల్ రావు మాట్లాడుతూ.. అంజాద్ మృతి విద్యారంగానికి తీరని లోటు అన్నారు. అంజాద్ మృతి పట్ల పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

News April 28, 2024

నల్గొండ: ఎండలు మండుతున్నాయి..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కొత్తగోల్‌తండాకు చెందిన కూలీ బాణోతు మంగ్యా(40) వడదెబ్బకు గురై..ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.