India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ప్రజలు సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. బాధ్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి-విజిల్ యాప్ అన్నారు.
మండల పరిధిలోని యాతవాకిళ్ళ వేములూరి ప్రాజెక్టులో భీల్యానాయక్ తండాకు చెందిన బానోతు సైదా నాయక్ (41) ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సైదానాయక్ కొన్ని రోజులుగా మతిస్తిమితం సరిగా లేక ఊళ్లు తిరుగుతున్నాడన్నారు. శనివారం ప్రాజెక్టు వద్దకు వెళ్లిన మత్స్యకారులు సైదాను గుర్తించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణలో 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. శనివారం NLGలో నూతనంగా నిర్మించిన అధునాతన 5 కోర్టుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన 5 కోర్టుల అధునాతన భవనంలో డిజిటలైజేషన్ తో పాటు, అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.
ఉమ్మడి జిల్లాలోని బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసి గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి యం. షకీనా తెలిపారు. NLG జిల్లాలో 18, SRPT జిల్లాలో 10, యదాద్రి జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.
NLG, MLG మున్సిపల్ పార్కులకు మహర్దశ పట్టనుంది. అమృత్ స్కీం కింద రెండు పట్టణాల్లోని పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. లక్ష జనాభా దాటిన ఈ రెండు మున్సిపాలిటీలు గతంలో అమృత్ స్కీం కింద ఎంపికైన విషయం తెలిసిందే. ఒక్కో పార్కుకు రూ.10 లక్షలు చొప్పున రెండు మున్సిపాలిటీల్లోని మొత్తం 12 పార్కులకు రూ.1.20 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోషల్ మీడియా సైట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని ఎస్పీ తెలిపారు. అనుచితమైన కామెంట్స్, పోస్టింగులు పెడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతగిరి మండలం పాలవరానికి చెందిన నాగమణి పుట్టుకతో అంధురాలు. కాగా తల్లి ప్రోత్సాహంతో నల్గొండ అంధుల పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపితో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెను వివాహం చేసుకునేందుకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్తికి చెందిన సోమగాని సందీప్ ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ జంట ఆదివారం పెద్దల సమక్షంలో ఒకటి కానుంది.
ఉమ్మడి జిల్లాలో NLG, BNG పార్లమెంట్ స్థానాలకు స్క్రూటినీ పూర్తైంది. నామినేషన్ల పరిశీలన అనంతరం NLGలో 31 మంది అభ్యర్థులు నిలిచారు. BNGలో 51మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29 కాగా, ఈ నెల 27వ తేదీ నాలుగో శనివారం కావడం, 28వ తేదీ ఆదివారం కావడంతో నామినేషన్లు ఆయా తేదీల్లో ఉపసంహరణకు దరఖాస్తులు స్వీకరించబోమని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
బైక్ నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎర్రగట్టు వద్ద జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.