India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి మెత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 51 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరి చందన తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లాఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్యవంశీ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా?ఏవైనా సమస్యలు ఉన్నాయా?ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటిస్తున్నారా?అని అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువతకు 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని NLG బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. MLG నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెంలో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి, సాధినేని శ్రీనివాసరావు, రంజిత్ యాదవ్, చల్లా శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రాయిపల్లికి చెందిన బోడ నరేష్ ఆయన కుమారుడు సాయికుమార్‌తో కలిసి మోటకొండూరు మండలంలోని చాడ గ్రామం బంధువుల ఇంట్లో ఎల్లమ్మ పండుగకు వెళ్లారు. పండుగ అనంతరం పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి నరేష్, సాయికుమార్, మృతి చెందారు.
నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న బోడ ఆశ్రిత వడదెబ్బతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అడ్మిషన్స్ కోసం ఎండలో క్యాంపెయిన్ చేస్తూ అస్వస్థకు గురై.. మృతి చెందింది. ఈ ఘటనతో అమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎండ తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
JEE మెయిన్స్ ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన దేశిరెడ్డి వినీల (33.10), శాగంటి సిరి (55.10), రుద్రారపు శ్రావ్య (64.41) వల్కి అక్షిత (28.05), అనంతుల శృతి (27.17) అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ షాహిన్ షేక్, అధ్యాపకులు అభినందించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో గురువారం జరిగిన రోడ్డు <<13120144>>ప్రమాదంలో <<>>తల్లిదండ్రులతో పాటు, నాయనమ్మ, తాతయ్యని కోల్పోయి కార్తీక్, కౌశిక్‌లు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, ఇద్దరు అన్నదమ్ములు స్వల్ప గాయాలతో మృత్యుంజయులుగా బయటపడ్డారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేడ జంగాల కాలనీలో గురువారం ఇద్దరు ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ముత్యాలు భార్య కనకలక్ష్మి(35), పులేందర్(40) రాజాపేటలోని పులేందర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒకే చీరతో ఉరేసుకున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భువనగిరి జిల్లా నారాయణపూర్(M) శేరిగూడెంకి చెందిన మహేశ్ కుమార్ ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించాడు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన అతనికి, SSC జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. అటువైపు జాబ్ చేస్తూ చదువుతూ ముందుకు వెళ్లాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాల్లో ఏకంగా రాష్ట్రంలోనే ఐదవ ర్యాంకు సాధించాడు.
Sorry, no posts matched your criteria.