India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నబిడ్డకు పాలిస్తూ.. గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన రఘునాథపల్లి(M) శివాయిగూడెంలో చోటుచేసుకుంది. డాక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భవాని(25) ఫిబ్రవరి 12న పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టింటికి నిద్ర చేసేందుకు వచ్చింది. ఈక్రమంలో బిడ్డకు పాలిస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీకుసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి రోజు 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందనకు సమర్పించారు. ప్రధాన పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 56 మంది 114 నామినేషన్ సెట్లను సమర్పించారు. వీటిని శుక్రవారం పరిశీలించనున్నారు.
నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వడగాడ్పులు వీస్తుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం జిల్లాలోనే అత్యధికంగా నిడమనూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా అత్యల్పంగా చింతపల్లి మండలం గుడికొండ గ్రామంలో 34.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 505.70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.4864 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,841 క్యూసెక్కులు ఉంది.
పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతులకు రెండు నెలలపాటు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతులు మే 1న గ్రామీణ సంస్థకు ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలన్నారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వారం రోజుల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మునగాల వద్ద జరిగిన యాక్సిడెంట్ మరువక ముందే ఇవాళ కోదాడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్లపై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
దేవరకొండకి చెందిన అజీజ్ అత్యంత ఎత్తైన (11,649 ఫీట్ల) ప్రదేశం”జోజి లా పాస్ “కు చేరుకున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుంచి బైక్‌పై ఆరు రోజుల్లో అక్కడికి వెళ్లిన అజీజ్ పర్వతాన్ని అధిరోహించాడు. అజీజ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.
సూర్యాపేట నుంచి భువనగిరిలో జరిగే పోరుబాట కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. బుధవారం పోరు బాట అనంతరం సూర్యాపేటలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో బస చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట నుంచి అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా ఆయన భువనగిరికి చేరుకోనున్నారు.
రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సొసైటి ఆధ్వర్యంలో నడపబడుచున్న 23 పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 28న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ కే.లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు onlineలో ఆప్లై చేసిన విద్యార్ధులు https://telanganaexmes.egg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కలెక్టర్ హరి చందన దాసరి సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు స్వయంగా రాసి, రికార్డు చేసిన పాటల సీడీని కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తాగునీరు, ఓఆర్ఎస్ తో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.