India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని అన్నారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.28,72,11,468గా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.5.2,59,650, భార్య చేతిలో రూ. 5.1,06,750 నగదు ఉన్నట్లు చూపించారు. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ.19,47,81,000, చరాస్తులు రూ.9,24,30,468.. కాగా భార్యాభర్తల పేరున ఉన్న మొత్తం అప్పులు రూ.73,48,373గా చూపారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి ఎర్రపహాడ్ శివారు జాతీయ రహదారి-365 పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆత్మకురు(S) మండలం పాతర్లపహాడ్‌కు చెందిన భీమ గాని రాములు ఏకైక కుమారుడు గణేష్(24) లారీ డ్రైవర్. సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై మాచినపల్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
తిప్పర్తి మండల కేంద్రంలో బుధవారం జరిగిన మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే జేబులోని పర్సు, తిప్పర్తికి చెందిన జాకటి డానియల్, ఏశబోయిన మల్లేష్ మెడలోని తులంన్నర బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీరితో పాటు రామలింగాలగూడెంకు చెందిన వనపర్తి నాగేశ్వరరావు చెందిన రూ.15వేల నగదును దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తుంది.
అతి వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. తమ ప్రాణాలే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను, ఎదుటివారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్ వివిధ బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా.. భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు.
కోదాడలో జరిగిన <<13118139>>యాక్సిడెంట్‌లో<<>> ఆరుగురు చనిపోయన విషయం తెలిసిందే. కోదాడ మం. చిమ్మిరాల వాసి శ్రీకాంత్ HYDలో కార్ డ్రైవర్. విజయవాడలో కూతురు లాస్య చెవులు కుట్టించేందుకు బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా కోదాడ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.. దీంతో శ్రీకాంత్, కుమార్తె లాస్య, బంధువులు మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణరాజు, స్వర్ణ చనిపోగా భార్య నాగమణి, మరో కుమార్తె లావణ్య, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు సాధించినట్లు ఆ సొసైటీ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ కె.లక్ష్మయ్య తెలిపారు. రెండు జిల్లాల్లోని 12 గురుకులాల నుంచి 711 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 630 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
జిల్లాలో నామినేషన్ల ఘట్టం నేడు ముగియనుంది. నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. నల్గొండ స్థానానికి 22 మంది నామినేషన్లు వేయగా ఆరుగురు మరో సెట్టు వేశారు. కొత్తగా 16 మంది తమ నామపత్రలను రిటర్నింగ్ అధికారి హరిచందనకు సమర్పించారు. ఇవాళ నామినేషన్ల గడువు ముగియనుండడంతో భారీగానే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
వలిగొండ SBIలో క్యాషియర్‌గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్‌పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి.మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై మహేందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడు అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు రూ.37.63 లక్షలను ఆన్లైన్ బెట్టింగ్ పెట్టినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.