Nalgonda

News March 27, 2024

యాదాద్రి: దారుణం.. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పు తప్పదా?

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సైదిరెడ్డిని మార్చాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. 

News March 27, 2024

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై తర్జనభజన

image

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికివ్వాలన్న దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఈ టికెట్ తనకు ఇవ్వాలని, ఏడాదిన్నరనుంచి నియోజకవర్గంలో పని చేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టు పడుతుండగా, వివిధ సర్వేల తరువాత అధిష్టానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీలో నిలపాలని ఆయనపై ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా బీసీ అంశం తెరపైకి వచ్చింది.

News March 27, 2024

NLG: పాతాళానికి గంగమ్మ..

image

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నీటి నిల్వలు పడిపోయిన జిల్లాల జాబితాలో NLG కూడా చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం 15 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా చందంపేట మండలంలో 16 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఇప్పుడు 16 మీటర్ల పడిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది.

News March 27, 2024

NLG: లక్షలు ఖర్చు చేస్తున్నా.. అందని వైద్యం!

image

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది NLG జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి తీరు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు స్థానికంగా ఉండే జనరల్ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ NLG ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలను వైద్యులు పక్కన పెట్టారు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.

News March 27, 2024

నల్గొండ: అంతా హస్తగతం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చండూరు, నేరేడుచర్ల, యాదగిరిగుట్ట మినహాయించి అన్నింట్లోనూ బీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చింది. మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, ఆలేరు, పోచంపల్లి, సూర్యాపేటల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వారు ఛైర్మన్లు ఉన్నారు. వీటిని కూడా చేజిక్కుంచుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

News March 27, 2024

ఎస్సీ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, RRB, SSC రాష్ట్ర స్థాయి& కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న NLGలో గల విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News March 26, 2024

‘రజాకర్’ సినిమా ఉచిత ప్రదర్శన

image

ఇటీవల విడుదలైన ‘రజాకార్’ సినిమాను వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో రేపు మార్నింగ్, మ్యాట్నీ షోలు వేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సహకారంతో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.

News March 26, 2024

జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.

News March 26, 2024

నల్గొండ జిల్లాకు KCR

image

మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.