Nalgonda

News April 24, 2024

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన ఓ మహిళను పోలీసులు కాపాడారు. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త గొడవపడ్డాడని పట్టణ పరిధిలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్తుండగా గమనించిన పోలీసులు ఆ సదరు మహిళను అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా వాసులు తోటి పోలీస్ సిబ్బంది అభినందిస్తున్నారు.

News April 24, 2024

సూర్యాపేట: కాలేజ్‌కి వెళ్లే టెన్షన్‌లో ఘోరం

image

మునగాల మండలం ముకుందాపురం వద్ద <<13101789>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన దంపతులు వివరాలు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన సామినేని నవీన్ రాజ, భార్గవి దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడకు బయలుదేరారు. నవీన్ రాజా విజయవాడలో శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కళాశాలకు చేరుకోవాలని కంగారులో అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారు: జగదీశ్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 16 స్థానాల్లో తామే ముందంజలో ఉన్నామన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలలో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు.

News April 24, 2024

దగ్గర పడుతున్న గడువు.. నామినేషన్ల జోరు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు వరుసగా ఈ 3 రోజుల పాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. NLG, BNG స్థానాలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీల వారు నామినేషన్లు పెద్దగా దాఖలు చేయలేదు. ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరే నామినేషన్లు వేయగా, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువమంది నామినేషన్లు వేశారు.

News April 24, 2024

నల్గొండ: 20ఏళ్ల తర్వాత ఎండిన మైల సముద్రం 

image

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వర్షాభావ పరిస్థితుల తోడు ఏఎమ్మార్పీ నీటిని చెరువుల్లోకి విడుదల చేయకపోవడంతో రెండు దశాబ్దాల తరువాత మొదటి సారిగా కనగల్‌ మైల సముద్రం చెరువు ఎండింది. ఈ చెరువు కింద దాదాపు 1,600 ఎకరాలకు పైగా సాగవుతోంది. 0.750 టీఎంసీల సామర్థ్యం కలిగిన మైల సముద్రం చెరువును నిజాం నవాబులు నిర్మించారు. చెరువు ఎండిపోవడంతో దీనిపై ఆధారపడ్డ 15 గ్రామాలకు పైగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది.

News April 24, 2024

భువనగిరి ఎంపీ అభ్యర్థి నామినేషన్ 

image

భువనగిరి కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరి, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి పాల్గొన్నారు. 

News April 22, 2024

చామల గెలుపు కోసం లండన్‌లో ప్రచారం 

image

లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ వివిధ గ్రామాల లండన్ ఎన్నారైలు కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. అమరపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశ నుంచే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా అనేక ప్రజ సమస్యల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన NRI యువకులు పాల్గొన్నారు.

News April 22, 2024

యాదాద్రి: లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

image

లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా సీఐ రమేశ్ కోరారు.

News April 22, 2024

సూర్యాపేట: ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

image

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు లారీ కిందికి దూసుకుపోయింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News April 22, 2024

NLG: టెట్ పరీక్షకు 27, 491 మంది దరఖాస్తు

image

టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌కు ఉమ్మడి జిల్లా నుంచి 27,491 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1 విభాగంలో మొత్తం 8,130 మంది, పేపర్-2లో 19,361 మంది దరఖాస్తు చేశారు. NLG జిల్లాలో పేపర్-1లో 3,954 మంది, పేపర్-2లో 9,162 మంది దరఖాస్తు చేశారు. SRPT జిల్లాలో పేపర్-1లో 3,242 మంది, పేపర్-2లో 5,767 మంది దరఖాస్తు చేసుకోగా, యాదాద్రి-BNG జిల్లాలో పేపర్-1లో 934 మంది, పేపర్- 2లో 4,492 మంది దరఖాస్తు చేశారు.