India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంకల్పానికి వయసు అడ్డేమి కాదని నిరూపించాడు సూర్యాపేట(D) కోదాడ వాసి గూటి వీరబాబు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. పదో తరగతి అతికష్టం మీద పాసవ్వగా అనంతరం ఇంటర్, డిగ్రీ, బీఈడీ చదివారు. గత 20 ఏళ్లుగా పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా త్రుటిలో చేజారాయి. 47 ఏళ్ల వయసులో డీఎస్సీలో సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం గ్రామంలో 12 వార్డుల్లో 2,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,463 మంది, పురుష ఓటర్లు 1,497 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీసీఐ నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. పత్తిలో 8 నుంచి12 శాతం వరకు తేమ ఉంటేనే మద్దతు ధర రూ.7,521 చెల్లిస్తామని సీసీఐ నిబంధన విధించింది. ఇటీవల వారంలో రెండు మూడు సార్లు వర్షాలు కురుస్తుండటంతో పత్తిలో తేమ శాతం 20నుంచి 30శాతం ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలో గత్యంతరం లేక వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు రైతులు తెలిపారు.

రైతులు పండించిన పత్తికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయుటకు భారత పత్తి సంస్థ వారిచే జిల్లాలోని నోటిఫై చేయబడిన 22 జిన్నింగ్ మిల్లులలో CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా CCI వారు నాణ్యత ప్రమాణాలతో తేమ శాతం 8% నుంచి 12% లోపు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.7521లు ప్రకటించిందన్నారు.

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. గతంలో కూడా ఆయన ఇక్కడ వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

కులగణన తర్వాత స్థానిక ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులెవరు? తమకు ఎవరు మద్దతిస్తారు..? తటస్థులు ఎంత మంది? అని విచారిస్తున్నారు. కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1740 జీపీలు ఉన్నాయి.

లేబర్ కార్డు కలిగిన 45 ఏళ్ల వయస్సు కలిగిన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.300 ఉపకారవేతనంతో పాటు మధ్యాహ్నం భోజనం, టీ షర్ట్, బ్యాగ్, సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలవారు నల్గొండ ప్రకాశం బజార్ లోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఇటీవల వరుసగా మరణాలు సంభవించాయి. అనారోగ్యంతో కొంతమంది, రోడ్డు ప్రమాదంలో మరికొందరు, వయసు మళ్లిన వారు వరుసగా మృత్యువాత పడ్డారు. గ్రామానికి కీడు దాపరించడంతోనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీడు పోవాలంటే సూర్యోదయానికి ముందే పిల్లా పెద్దలతో సహా ఊరంతా ఖాళీ చేసి సూర్యాస్తమయం వరకు బయట ఉండాలని నిర్ణయించారు.

రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలం ఆల్వాలపాడు గ్రామానికి చెందిన చిర్ర శ్రవణ్ (16) అనే యువకుడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆత్మహత్య కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.