India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు శుక్రవారం పశువులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. కాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగడం కోసం బావిలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు , అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం- 12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో NLG పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండో రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు, మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) తరఫున వసుకుల మట్టయ్య, కిన్నెర యాదయ్య స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కోసెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు (55) జిల్లాలో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు రాంబాబును మిర్యాలగూడ లో పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల 24 వేల విలువ గల 20 తులాల 3 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్‌లోని 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ ఆదిభట్ల పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్ పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
తుంగతుర్తిలో క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బాపన్ బాయి తండా ఎక్స్ రోడ్‌లో పసుపు కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో చేసిన క్లాత్‌తో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రాత్రి చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ స్థానానికి సీపీఐ (ఎం) పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ వేశారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, నాయకులు కొండమడుగు నరసింహలతో కలిసి రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
భువనగిరి మండలం పెంచికలపాడులోని బాల్దా రాములుకు చెందిన గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. దీంతో గ్రామస్థులంతా ఆ గొర్రె పిల్లను చూడడానికి వచ్చారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. కాగా పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల చనిపోయింది.
భారతదేశ ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు, మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదేళ్ల లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు రాచకొండ భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ఏర్పాటు చేసినందున కలెక్టరేట్ ప్రాంగణం బయట 100 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.