India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటర్లలో సగ భాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్‌సభకు పంపలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు వారిని ఆకర్షించే పథకాలను, హామీలను ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి కానీ మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు.
ధర్మ సమాజ్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొంగరి లింగస్వామి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆయనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తూ బీ ఫామ్ అందించారు. లింగస్వామి స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. టికెట్ కేటాయించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాల్లోని పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కనగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పర్వతగిరికి చెందిన చెనగోని కావ్య అనే యువతి రెండు సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. తల్లి చెనగోని లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లా పరిధిలో 28గురుకులాలు, 5 డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్ శ్రీరాముల శ్రీనివాస్‌ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్ చేయడంపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
నల్గొండలో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రఘుబాబు కారు తగిలి <<13072708>>బీఆర్ఎస్ నేత జనార్ధన్ రావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అజాగ్రత్తగా కారు నడిపి రఘుబాబు తన భర్త మృతికి కారణమయ్యారని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై నాగరాజు వెల్లడించారు.
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి అన్నారు. ‘ఘటనపై విచారణ కమిటీని నియమించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పొరుగు సేవల కింద ఉద్యోగం ఇస్తాం. ప్రాథమిక విచారణ అనంతరం ప్రిన్సిపల్ శ్రీరామ్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశాం’ అని వివరించారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.