Nalgonda

News April 17, 2024

అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలోనే

image

రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిడమనూరులో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 17, 2024

రోడ్డు ప్రమాదం.. బీఆర్ఎస్ నేత మృతి

image

నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ బైపాస్ లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19వ వార్డుకు చెందిన నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు సంధినేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

రేపటి నుంచి నేనేంటో చూపిస్తా : మంత్రి కోమటిరెడ్డి

image

కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వల్లే కవిత బలైందన్నారు. చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూమ్​ కట్టించి స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అంటే ఏంటో చూపిస్తా అంటూ బీఆర్​ఎస్​ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్​ఎస్​ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.

News April 17, 2024

గుట్ట దేవస్థానంలో ఓ ఉద్యోగి నిర్వాకం.. 

image

YGT దేవస్థానంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అధికార దుర్వినియోగం, అవకతవకల ఘటనపై ఆ శాఖ ఉన్నత అధికారి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆలయంలో ఫౌంటెయిన్లు లేకున్నా ఏర్పాటు చేసినట్లుగా.. నిర్వహణ పేరుతో ఏడాదిగా బిల్లుల విషయంలో సదరు ఉద్యోగి చేసిన నిర్వాకం ఇటీవల ఉన్నతాధికారి పరిశీలనలో తేలినట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

News April 17, 2024

NLG: జనరల్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వేరువేరు!

image

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ తో పాటు ఫారం 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్ హరిచందన తెలిపారు.

News April 17, 2024

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు NLG కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ చేసే అభ్యర్థులు ఫారం 2ఏ లో అన్ని వివరాలు పూరించి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు.

News April 17, 2024

NLG: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మునుగోడు మండలంలోని కోతులారంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిళ్ల వంశీ లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. డ్యూటీ దిగి ఇంటికి వచ్చి.. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి, నారాయణపురంలోని ఇటుకల బట్టి వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News April 17, 2024

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకాల్వ తండాకు చెందిన నరసింహ కుటుంబ కలహాలతో పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. మనస్తాపానికి గురై మండలంలోని అవంతీపురంలోని బాలాజీ టౌన్ షిప్ లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 17, 2024

NLG: ‘ఇవేమి ఎండలు..! గతంలో ఎప్పుడూ చూడలేదు’

image

ఇవేమి ఎండలు నాయనా.. గతంలో ఎప్పుడూ ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు.. అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. మంగళవారం జిల్లాలోని మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.7, నాంపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11 మండలాల్లో 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 17, 2024

NLG: జిల్లాలో కొనసాగుతున్న రేషన్ ఈ – కేవైసీ

image

ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ.. రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని.. త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.