Nalgonda

News April 17, 2024

ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్ల టోకరా

image

కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర మిల్లుపై అడిషనల్ కలెక్టర్ లతా విజిలెన్స్ అధికారులతో మంగళవారం దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ఉన్న సీఎంఆర్ నిలువలను తనిఖీ చేశారు. సుమారు 22 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐకి బాకీ ఉన్నట్లు తెలిపారు. 60 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ దాడుల్లో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎం సివిల్ సప్లై రాములు ఉన్నారు.

News April 16, 2024

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే

image

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది. ఇబ్రహీంపట్నం-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునుగోడు-గోపగాని వెంకటనారాయణ గౌడ్, భువనగిరి-నంద్యాల దయాకర్ రెడ్డి, నకిరేకల్-ఎలిమినేటి సందీప్ రెడ్డి, తుంగతుర్తి-బూడిద బిక్షమయ్యగౌడ్ , ఆలేరు- ఎగ్గే మల్లేశం, జనగామ-కంచర్ల రామకృష్ణారెడ్డిలను ఇంఛార్జీలుగా నియమించింది.

News April 16, 2024

బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే

image

నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇంఛార్జీలను బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. నల్లగొండ-తిప్పన విజయసింహారెడ్డి, నాగార్జునసాగర్- బండ నరేందర్ రెడ్డి, హుజూర్ నగర్-ఒంటెద్దు నరసింహారెడ్డి, దేవరకొండ- రేగటి మల్లికార్జున్ రెడ్డి, మిర్యాలగూడ-బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ- కటికం సత్తయ్య గౌడ్, సూర్యాపేట-ఇస్లావత్ రామచంద్రా నాయక్ లను నియమించింది.

News April 16, 2024

సూర్యాపేట సద్దుల చెరువులో మహిళ మృతదేహం

image

సూర్యాపేట సద్దుల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సద్దుల చెరువులో మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి కుడి చేతిపై ఉమా అని పేరు రాసి ఉందని తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు.

News April 16, 2024

నల్గొండ: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతి 

image

చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన నూనె సంజీవయ్య కుమారుడు నూనె శ్రవణ్ కుమార్ మంగళవారం ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించారు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2024

నల్గొండ: 3నెలల్లో ఏడుగురు దొరికారు..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొలువులను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న ఉద్యోగులపై అనిశా దృష్టి పెట్టింది. అయితే గడిచిన 3 నెలల్లోనే ఏడుగురు అధికారులు అనిశాకు చిక్కడం గమనార్హం. ఇందులో యాదాద్రి జిల్లాలో రవాణా అధికారితో పాటు మోత్కురు మండలం పొడిచేడులో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వరకు ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

News April 16, 2024

NLG: భానుడి భగ భగ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటలు దాటితే బయటికి రావాలంటే జంకుతున్నారు. రెండు, మూడు రోజులు వడగాలులు వీస్తాయని అవసరమైతే  తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

News April 16, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్

image

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ సెగ్మెంట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇన్‌ఛార్జులుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొనడంతో.. వారిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

News April 16, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం అడుగంటిపోతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 508.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 129.6422 టీఎంసీల నీరు ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,500 క్యూసెక్కులుగా ఉంది.

News April 16, 2024

NLG: తపాలా శాఖ ఉద్యోగిని మిస్సింగ్

image

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన రామావత్ ఉదయశ్రీ గత 9 నెలలుగా నిడమనూరు బ్రాంచి-4 పోస్టు ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. MLGలో తన బాబాయి ఇంట్లో ఉంటూ విధులకు వచ్చి వెళ్ళేది. అదే విధంగా ఈ నెల 12న విధులకు వెళ్తున్నానని చెప్పి, ఇంటికి తిరిగి రాలేదు. బంధువులను, స్నేహితులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి శ్రీను సోమవారం నిడమనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.