Nalgonda

News March 17, 2024

నల్గొండ: పట్టభద్రుల ఓటర్లు 5,06,527 మంది

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.

News March 17, 2024

నల్గొండ: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా..?

image

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ అమలుతో పలు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దులు తగిన చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

News March 17, 2024

సూర్యాపేట: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News March 17, 2024

భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో?

image

BRS తరఫున నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల్లోని సీనియర్‌ నేతలతో పలుమార్లు చర్చించినా.. అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదు. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి వైపు అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. భువనగిరి నుంచి జిట్టా బాలక్రిష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు, బూడిద బిక్షమయ్యగౌడ్‌ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

News March 17, 2024

NLG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

image

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. జంబ్లింగ్ విధానంలో హాల్ టికెట్ నంబర్లను కూడా వేశారు. రోజూ ఉదయం 9.30 గం టల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి పరిశీలించారు.

News March 17, 2024

గడ్డి మందు తాగి యువకుడు సూసైడ్ 

image

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజ్జిలాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమూరు మైపాల్ రెడ్డి అనే యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ మనస్థాపానికి గురై శుక్రవారం గడ్డి మందు తాగడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం యువకుడు మరణించాడు

News March 17, 2024

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి

image

సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి వరించింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డ ఆయనకు, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రఘువీర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2024

పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్ హరిచందన

image

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఈనెల18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని ఆమె పేర్కొన్నారు. 

News March 16, 2024

చిట్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చిట్యాలలోని భువనగిరి రోడ్డులో ప్రమాదం జరిగింది. చిట్యాల ఎస్సై సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుదాటుతున్న రాములు అనే వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జగిత్యాలకు చెందిన వీరు కుమార్తె చికిత్స కోసం చిట్యాల వచ్చారు.

News March 16, 2024

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.