India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో ఓటర్ల పేరుతో వెలిసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆలోచింపజేస్తుంది. ఉచిత పథకాలు, గ్యారంటీలు ప్రకటించిన పార్టీలకు ఇది చెంపపెట్టు అని ప్రచారం జరుగుతుంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనా దీప్తి ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామన్నారు. వాడపల్లి, అడవిదేవులపల్లి, టైల్ పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో జిల్లా మొత్తం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. రామన్నపేట మండలానికి చెందిన రమేశ్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో చనిపోయారు. పాలకవీడు మండలం యల్లాపూరం గ్రామానికి చెందిన రమణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా కల్వర్టును ఢీకొని మృతి చెందాడు. చౌటుప్పల్ మండలానికి చెందిన యాదయ్య XLపై పంతంగి గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది.
భువనగిరి పట్టణంలోని డాక్టర్ చావా రాజ్‌కుమార్ కుమారుడు చావా తారక్‌నంద ప్రతిభ చాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. శనివారం దిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పోటీల్లో అతి తక్కవ సమయం 42 సెకండ్లలో ప్రపంచంలోని 100 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పాడు. దీంతో రికార్డు తన సొంతం చేసుకున్నాడు.
రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ , మైనారిటీల సంక్షేమ శాఖ వారు UPSC – CSAT 2025 పరీక్ష కోసం 100 మంది మైనారిటీ అభ్యర్ధుల నుండి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ఈ నెల 22 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఆసక్తి కలిగిన మైనారిటీ విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. శనివారం నాటికి రూ.12.66 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో బస్ షెల్టర్‌పై మాజీ ప్రజాప్రతినిధి పేరు కనిపించే విధంగా పెద్ద బోర్డు నేటికి అలాగే ఉందని, పంచాయతీ అధికారులు కోడ్ అమలులో శ్రద్ధ చూపడం లేదని శనివారం గ్రామస్థులు కోడ్ ఉల్లంఘనల కింద ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అసెంబ్లీ నియోజకవర్గ ఏఆర్వో కార్యాలయం సువిధ విభాగం అధికారులు వెంటనే స్పందించారు.
ఓటరు నమోదుకు ఈనెల 15 వరకే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటు జాబితాలో పేరు ఉండాలి. అయితే 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు హక్కు పొందని వారు వెంటనే నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత ఉన్నా.. ఓటు రాదని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి రాకుండా ముందస్తుగా తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, బీఎల్వోల వద్ద జాబితా చూసుకోవాలని సూచించారు.
నల్గొండ జిల్లాకు మరో అరుదైన ఘనత దక్కింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డీఎస్వో వెంకటేశ్వర్లు, డీసీవో కిరణ్ కుమార్, అధికారి నాగేశ్వర్‌రావుతో కలిసి అదనపు కలెక్టర్ శనివారం కొత్తపల్లి, కేశరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే 77,785 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
దేవరకొండ పట్టణంలో ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన 80మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నెల 4, 6వ తేదీల్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా 80మంది గైర్హాజరయ్యారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యి వారికి నోటీసులు పంపారు. ఎందుకు హాజరు కాలేదో కారణం చెప్పాలన్నారు.
Sorry, no posts matched your criteria.