Nalgonda

News April 14, 2024

NLG: పరీక్షలకు వేళాయే

image

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు జరుగనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యుల్‌‌లో మార్పులు చేసి ఉదయం పూటనే అన్ని పరీక్షలు నిర్వయించేందుకు టైం టేబుల్ రిలీజ్ చేశారు. జిల్లాలోని ప్రభువ్వ, ప్రైవేట్, గురుకులాలకు సంబంధించి 1,527 పాఠశాలకు పరీక్షలు కొనసాగుతున్నాయి. వీటిలో 1,19,030 మంది విద్యార్థలు చదువుతున్నారు.

News April 13, 2024

NLG: ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ ఫోకస్!

image

కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని 2 సిట్టింగ్ పార్లమెంటు స్థానాలపై రేవంత్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జిల్లా కాంగ్రెస్ పై పట్టు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. జిల్లాలో తన టీమ్ ఏర్పాటు కోసమే దిగ్గజనేతల మధ్య సమన్వయం కోసం స్వయంగా రేవంత్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

News April 13, 2024

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

image

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు యాదగిరిగుట్ట పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని.. దీంతో భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..

News April 13, 2024

రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సుంకరి మొగ్గయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో క్యాబ్లో వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్తతో ముందున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మొగ్గయ్యగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 13, 2024

SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చింతలపాలెం మండలం చింత్రియాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

NLG: అసెంబ్లీ వారీగా నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు

image

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈనెల 13 నుంచి 22 వరకు జరుగుతాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్నగర్, 21న సూర్యాపేట, 22న నాగార్జునసాగర్ నియోజకవర్గాల సమావేశాలు సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు.

News April 13, 2024

నేటి నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు

image

నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం రోజూ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాలను నిర్వహించబోతుంది. 13వ తేదీన దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్ నగర్, 20న సూర్యాపేట, 21న నల్లగొండ, 22న నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

News April 13, 2024

SRPT: ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) HYDలో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వీరబాబుతో 4ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించిన అతను నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఇంటికి వెళ్లిన యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.

News April 13, 2024

NLG: భర్త మృతి తట్టుకోలేక ఆత్మహత్య

image

కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నాగమణికి 8 నెలల కిందట వివాహమైంది. 2 నెలల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందాడు. భర్త మృతి తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కోదాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 13, 2024

NLG: ఆరు నెలలుగా చక్కర పంపిణీ బంద్!

image

ఉమ్మడి జిల్లాలో అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదు. ఆరు నెలలుగా చక్కెర పంపిణీని నిలిపివేసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆహార భద్రత కార్డుదారులకు గతంలో బియ్యం, చక్కెర, గోధుమలతో సహా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆహార భద్రత కార్డులకు బియ్యం, అంత్యోదయ కార్డులకు బియ్యంతో పాటు చక్కెర మాత్రమే ఇస్తూ మిగతా వాటికి కోత పెట్టింది.