India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు, ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం, అఫిడవిట్‌లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించడం నేరంగా పరిగణించబడుతుందని ఎస్పీ వెల్లడించారు.
ప్రయాణీకులు కొన్నిసార్లు రైలు పైకప్పు, స్టెప్ (ఫుట్ బోర్డ్) మీద ప్రయాణిస్తున్నారని… రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించడం ప్రమాదకరం, సురక్షితం కాదు… చట్టవిరుద్ధమని గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల ఉపయోగం కోసం ఉద్దేశించబడని రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఆయా షిప్టు సమయాల్లో విద్యుత్ ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు.
రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగుల పేరిట ఇబ్బందులకు గురి చేసిన, మద్దతు ధరకు కంటే తక్కువ చెల్లించిన మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఐకెపి, సొసైటీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయు రైస్ మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఈ 10 రోజుల కాలంలో 12 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈనెల 4న ఇద్దరు చిన్నారులు ,ఇద్దరు ఉపాధ్యాయినీలు, మరో వృద్ధురాలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 8న ఓ యువకుడు, ఈ నెల 10న ఓ యువకుడి, ఈనెల 11న ఆరుగురు యువకులు ఇదే జాతీయ రహదారి 65 మృతి చెందారు. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో శుక్రవారం నీటి నిల్వల సమాచారం ఇలా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 510.30 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 132.18020 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 527.10 అడుగులు, 164.09 క్యూసెక్కుల నీటి నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 7,370 క్యూసెక్కులుగా ఉంది.
తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతలపై దృష్టి పెట్టింది. ఇటీవల హైకోర్టు సైతం ఇంకుడు గుంతలు తప్పని సరిగా తీయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో 350 గజాలు దాటిన ప్రతి భవనం, అపార్ట్మెంట్స్, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు వాణిజ్య సముదాయాల్లో తప్పని సరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళిని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా SP రాహుల్ హెగ్డే హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో MCC కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం. నేరేడుచర్లకి చెందిన అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పాలకీడు కానిస్టేబుల్ చింతలచెరువు విష్ణును సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
సూర్యాపేట జాతీయరహదారిపై బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతులు నవీద్ (25), నిఖిల్ రెడ్డి (25), రాకేష్ (25)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ మరో వ్యక్తి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా రూ.1.71 లక్షల నగదు, రూ. 7.75 వేల విలువ గల మద్యం, 20, 000 విలువగల గంజాయి, రూ. 1.14 లక్షల విలువగల ఆభరణాలు, 86 లక్షల విలువగల ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.4.55 కోట్లు సీజ్ చేశామన్నారు
Sorry, no posts matched your criteria.