India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణపట్టి తీరాన్ని ఆవరించి ఉన్న వైజాగ్‌కాలనీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళ.. ఆకర్షణీయంగా ద్వీపకల్పంలా కనువిందు చేస్తున్నాయి. మూడు దిక్కుల నీరుండి మధ్యలో వైజాగ్‌కాలనీ గ్రామం ఉండడంతో ద్వీపకల్పాన్ని తలపిస్తుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తైన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే BNG ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా చామల పేరును అధిష్ఠానం ప్రకటించింది.
సంస్థాన్ నారాయణపురం మండలంలో పొట్ట మీద ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటలు పడుతున్నారు. ఎప్పటిలాగే పంటలు పండుతాయి అనే నమ్మకంతో పంట సాగు చేశారు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి రోజురోజుకు బోర్లలో నీళ్లు తగ్గుతుండడంతో పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు పోయాల్సి వస్తుందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో కొన్నిచోట్ల పైరుకు నీరు అందక పంటను పశువులకు మేపుకుంటున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంటలను పరశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి , హాలియా ప్రాంతాల్లో పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో జరిగింది. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయోధ్య కుమార్తె చందన(23)కు మిర్యాలగూడకు చెందిన ఆనందం వేణుతో 2021లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో చందన సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్రే కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటికి ఆర్వోలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. వారి ఆధ్వర్యంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. క్వింటా ధర రూ .7వేలు పలుకుతుంది. గతంలో దొడ్డు బియ్యం వాడకం ఎక్కువగా ఉండగా.. రాను రాను వినియోగం తగ్గిపోయింది. దీంతో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.
జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ఈనెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మఠంపల్లి మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో జరుగు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.