India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్‌ను NLG DSB నుంచి SRPTకి, వెంకటేశ్వర్లును NLG VR నుంచి SRPTకి, కృష్ణయ్యను MLG టూ టౌన్ నుంచి మాడుగులపల్లికి, శోభన్ బాబును మాడుగులపల్లి నుంచి NLG VRకు, విజయ్ కుమార్‌ను వేములపల్లి నుంచి నల్గొండకు, సందీప్ రెడ్డిని NLG 1-టౌన్ నుంచి MLG రూరల్‌కు బదిలీ చేశారు.

ఈ సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్)పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ ఇప్పటివరకు 90% పూర్తయిందని, తక్కిన 10శాతాన్ని ఈ వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. పూర్తిచేయని వారిని డిఫాల్టర్లుగా గుర్తిస్తామన్నారు.

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు, భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టు పనులన్నింటిని వేగవంతం చేయాలని తెలిపారు.

దామరచర్ల మండలం ఓ తండాలో ఈనెల 14న జరిగిన హత్యాచార కేసును ఛేదించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తండాకు చెందిన యువతిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సస్పెండ్ చేశారు. పెద్దవూర మండలం పులిచెర్లకు చెందిన కార్యదర్శి కే.నాగరాజు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాచ్యా తండాకు చెందిన జేపీఎస్ కే.స్వప్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. నేడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత్, జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,152 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 44,153 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. కుడి కాలువకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2,765 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1,800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

NLG: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 57మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

మూసీకి వరద పొటెత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు. హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంతో కేతపల్లి మండలం భీమారంలో వరద పొట్టెత్తింది. పశువుల కాపర్లు వాగులో చిక్కుకున్నారు. 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆదేశాలతో వారిని జేసీబీ సాయంతో తీసుకోచ్చారు. హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.