India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11, 12న రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాహుల్ మంగళవారం తెలిపారు. ఈనెల 11న గురువారం రంజాన్, 12న శుక్రవారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 13న మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు మంగళవారం మధ్యాహ్నం కొత్తపేట వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రవికుమార్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. మిత్రుడిని పరామర్శించి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు టైరు కొత్తపేట క్రాస్ రోడ్ సమీపంలో పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్, మెట్రో రైలు పిల్లర్ గుద్దుకోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.
తుర్కపల్లి మండలం ములకలపల్లి శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజమణి ఈ ప్రమాదంలో మృతి చెందారు. డొంకేన రాములు, రాజమణి దంపతులు ద్విచక్ర వాహనంపై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. రాజమణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం సమాచారం మేరకు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.10 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను ప్రస్తుతం 133.5447 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 6,498 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో నిల్ ఉంది.
RRR నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు RRR నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల 500 మంది రైతులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అలైన్మెంట్ మార్చాలని మంత్రిని కోరగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని అప్పటిలోగా రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
మిర్యాలగూడలో వడదెబ్బ కారణంగా సోమవారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ప్రకాష్ నగర్ తొమ్మిదో వార్డుకు చెందిన శ్యామల పెంటయ్య(70), బండి అడవయ్య (65) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
సూర్యాపేట మానసనగర్ వద్ద జరిగిన <<12992243>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఐదుకు చేరింది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోక్షిత్ (7) ఇవాళ మృతిచెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి(ఎంబావి)లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఓ దుండగుడు జక్క నిర్మల అనే మహిళ మెడలోంచి పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. ఘటనలో మహిళ మెడకు గాయాలు కూడా అయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెడుతున్నప్పటికీ చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన వంద మంది మైనారిటీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సీఎస్ఏటీలో రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 22 వరకు www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 6న తుంగతుర్తిలో సమావేశం నిర్వహించగా, సోమవారం మునుగోడు అసెంబ్లీ పరిధిలో సన్నాహక సమావేశం నిర్వహించింది. రేపు ఉదయం SRPTలో సమావేశం నిర్వహించనుంది. 12న ఉదయం కోదాడ, మధ్యాహ్నం HZNRలో, 13న ఉదయం NKL, మధ్యాహ్నం ఆలేరు సమావేశాలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది.
Sorry, no posts matched your criteria.