Nalgonda

News March 28, 2024

భువనగిరి: ఎంపీ అభ్యర్థి చామల రాజకీయ నేపథ్యం ఇదే

image

భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం. యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

News March 28, 2024

చౌటుప్పల్: లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రిమాండ్

image

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దండు మల్కాపురంలోని ఓ కంపెనీలో పని చేస్తుంటారు. ఈనెల 25న రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం నల్గొండ జైలుకు తరలించారు.

News March 28, 2024

NLG: మాస్టర్ ప్లాన్.. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే!

image

NLG మున్సిపాలిటీలో 40 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. పాత మాస్టర్ ప్లాన్ వల్ల మున్సిపాలిటీ ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ కోసం చేస్తున్న కసరత్తు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. పాలకవర్గాలు, ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారే గాని మాస్టర్ ప్లాన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News March 28, 2024

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

image

జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు సూచించారు.

News March 27, 2024

NLG: మార్చిలోనే మండుతున్న ఎండ!

image

వేసవి భగభగలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఉదయం 7 నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడు వరకు తగ్గడం లేదు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం కలవరపరుస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. మరో అయిదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

News March 27, 2024

మిర్యాలగూడ : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..?

image

మిర్యాలగూడ పట్టణంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లపై బుధవారం పోలీసులు దాడి చేసి పదిమంది మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు చేసి 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

News March 27, 2024

‘సూర్యాపేట’ ఇక కనుమరుగేనా..?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల కుదింపులో సూర్యాపేట జిల్లా తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News March 27, 2024

లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలు లైసెన్స్ లు కలిగి ఉన్నాయని, వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్‌ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.

News March 27, 2024

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి

image

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం చిక్కాడు. మోత్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఇంటి అనుమతి కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

News March 27, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధులు వచ్చాయ్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. NLG జిల్లాకు రూ. 4.5 కోట్లు, SRPTకు రూ. 2.70 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.82 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు గత నెలలో మంజూరు చేశారు. వాటిలో నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున తాగు నీటికి ఖర్చు చేయనున్నారు.