India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఎన్యూమరేటర్లను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలో సర్వే నిర్వహణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందని తెలిపారు.

విద్యా ప్రమాణాల నైపుణ్యాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాప్ హుస్సేన్ అన్నారు. ఎంజి యూనివర్సిటీలో సోమవారం అని శాఖల అధిపతులు, బి ఓ ఎస్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధిగా హాజరు ప్రమాణాలు పాటిస్తూ.. అల్మానాక్ ప్రకారం ముందుకు సాగాలని సూచించారు.

పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలల పాటు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులు ఈ నెల 11వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. యువతులకు హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు.

మిర్యాలగూడ సీతారాంపురం కాలనీ రామాలయం వీధిలో ఓ వ్యక్తి గొయ్యి తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. విగ్రహాన్ని చూడడానికి స్థానికులు బారులు తీరారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. ఇంటింటా సమగ్ర సర్వే ఈనెల 6న ప్రారంభం, 15రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2,47,354 ఇళ్లు.. 1938 మంది ఎన్యుమరేటర్లు నియామకమయ్యారన్నారు. పీఎస్‌ల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వే పూర్తయిన ప్రతీ ఇంటికి స్టిక్కర్ వేయాలన్నారు.

యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యలే కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నాయి. నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కటుకూరి రవిశంకర్ (42) నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్మెంట్లో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వెంకటమ్మ నల్గొండ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

కనగల్ మండలం షాబ్దుల్లాపురం కాలువలో <<14512610>>తండ్రి, కొడుకులు గల్లంతు<<>> కాగా నేడు ఉదయం సురవరం దామోదర్ మృతదేహం లభ్యమైంది. నల్లగొండ పరిధిలోని గుండ్లపల్లి వద్ద కాలువలో నేడు ఉదయం తండ్రి అయిన దామోదర్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుమారుడు ఫణింద్ర వర్మ ఆచూకీ ఇంకా లభించ లేదు.

ఈ నెల 6 నుండి నిర్వహించనున్న సామాజిక ,ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విషయమై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కార్తీక మాసంలో ఒకే రోజు పంచారామ దర్శనం కోసం నల్గొండ రీజినల్ నుండి అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్ లు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దర్శనం ఉంటుందన్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు అన్ని డిపో స్టేషన్ ల నుండి నవంబర్ 3,10,17,24 తేదీలలో బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.