Nalgonda

News April 7, 2024

NLG: ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేనా?

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. టెట్ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్ఈఆర్టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్ తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News April 7, 2024

NLG: భానుడు @ 44.5 డిగ్రీలు…!

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం వేళల్లో సైతం ఎండల ధాటికి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం నాంపల్లి, పెన్‌పహాడ్ ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి నుంచి రక్షించుకునే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 7, 2024

నల్గొండ: 1379 కిలోల గంజాయి దగ్ధం

image

నార్కెట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామ శివారులోని
12th బెటాలియన్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద పలు కేసుల్లో పట్టుబడ్డ 1379 కిలోల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనా దీప్తి నిర్వీర్యం చేశారు.
గంజాయి విలువ రూ. కోటి 93 లక్షలు ఉంటుందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించిన వాడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News April 6, 2024

NLG: విషప్రయోగం.. 11 ఆవులు మృతి –

image

నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం బచ్చాపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తోటలో తరచూ ఆవులు మేత కోసం వస్తున్నాయని ఆ తోట యజమాని నీటి సంపులో విషప్రయోగం చేశాడు. ఎప్పటి లాగే మేతకు వచ్చిన పశువులు విషం కలిపిన నీళ్లు తాగడంతో 11 ఆవులు మృతి చెందాయి. మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2024

నల్గొండ జిల్లాలో చిరుత సంచారం..!

image

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో చిరుత సంచరిస్తుందని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు తెలిపారు. అక్కడకు చేరుకున్న అధికారులు రైతులను ఆరాతీస్తున్నారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

NLG: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.. తీవ్ర గాయాలు

image

చిట్యాల మున్సిపాలిటీలోని సంతోష్ నగర్ కాలనీలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ డీఎస్సీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఇంటిని కిరాయికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వరరావు బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

News April 6, 2024

NLG: ఆదర్శ పాఠశాలలో పరీక్ష తేదీల ఖరారు

image

మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 7న ఆన్ లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10గం.ల నుంచి 12గం.ల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2గంల నుంచి 4గం.ల వరకు 7- 10వ తరగతుల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ స్వరూప రాణి తెలిపారు.

News April 6, 2024

భువనగిరి: రైలు కిందపడి యువకుడు మృతి

image

భువనగిరి మున్సిపాలిటీ టీచర్స్ కాలనీ సమీపాన రైల్వే ట్రాక్ పై రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తెల్జీరి చిన్న యాదవ్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News April 6, 2024

సూర్యాపేట: ఆత్మీయులే పట్టించుకోలేదు.. అనాథలా మృతి

image

నేరెడుచర్లలో ఆత్మీయులు పట్టించుకోకపోవడంతో వృద్ధురాలు అనాథలా మృతి చెందింది. విద్యానగర్లో చెట్టుకింద జీవనం సాగిస్తున్న సైదమ్మ(80) అనే వృద్ధురాలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు 108 ద్వారా హూజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సైదమ్మ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2024

సూర్యాపేట: గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

image

సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోతు విజయ అనే మహిళ గంజాయి తాగుడుకు అలవాటైంది. ఇదే క్రమంలో డబ్బు సంపాదనకు గంజాయి విక్రయిస్తోంది. చింతలపాలెం బస్టాండులో విజయను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. ఆమె వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.