India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని తన కూతురి పేరులో చూపెట్టాడు పాలకీడు మండలం శూన్యంపాడులోని ఓ కార్యకర్త. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరంలో కూతురు పుట్టడంతో బాలికకు రమావత్ కాంగ్రెస్ అని పేరుపెట్టాడు. అనంతరం కాంగ్రెస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అందించే ఏ సాయాన్ని కూడా తీసుకోకపోవడం గమనార్హం.
కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో జరిగింది. రెడ్ల కుంటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ హలీం విద్యుత్ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఇంటి పైనుంచి 11 కేవీ వైర్ వెళ్లిన విషయం గమనించకుండా అల్యూమినియం బద్దెలు ఎత్తుతుండగా అవి విద్యుత్ తీగల తగిలి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతమైంది. ఈనెల 3న నల్లగొండలో మూల్యాంకనం ప్రారంభించగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో శుక్రవారం అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యారు. సెలవు దినాల్లోనూ మూల్యాంకనం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ సీఐని విచారించగా, నల్గొండలో వార్ రూం ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరెవరు బయటకొస్తారోనన్న ఉత్కంఠ ఉంది.
కోదాడకు చెందిన గుండు రవి పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై కోదాడ వస్తుండగా వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రవి కోదాడలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రవి మృతి పట్ల ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.
జిల్లాలో ఈ నెల తొలివారం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కలుగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం సమయంలో జన సంచారం లేక నిర్మానుషంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి తాను, ఢిల్లీలో నరేంద్ర మోదీ విజయం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ లాంటిదని ఆ పార్టీకి ఢిల్లీలో గల్లీలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వేడిమి సంబంధ వ్యాధుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.