India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని వారిపై అభియోగం. అప్పట్లో మాజీ ఓ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు సహకరించినట్లు తెలుస్తోంది.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాయినిగూడెం సెవెన్ స్టార్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తిస్తే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయలన్నారు. 8712686006, 8712683060 నంబర్లను సంప్రదించాలని ఎస్సై బాలునాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
సూర్యాపేటలో జరిగిన <<12991416>>రోడ్డుప్రమాదంలో<<>> 17నెలల చిన్నారి వేదస్విని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించాక గంటపాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. పాప ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. నలుగురు వైద్యులు, నలుగురు నర్సులు ఆక్సిజన్ అందించి సీపీఆర్ చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో వైపు చిన్నారి తల్లి పక్క బెడ్ పైనే అపస్మారకస్థితిలో ఉంది. ఈ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి.
సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<12991416>>ముగ్గురు మృతిచెందగా,<<>> 14మందికి గాయాలైన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పెద్ద శబ్దంతో సినిమా పాటలు పెట్టి నిర్లక్ష్యంగా ఆటో నడపడం కూడా ప్రమాదానికి ఓ కారణమని బాధితుల బంధువులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.
సూర్యాపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సరిత మృతి చెందారు. ఆటోలో ఉన్న లావణ్య, పావని అనే మరో ఇద్దరు టీచర్ల పరస్థితి విషమంగా ఉంది. వీరిలో లావణ్యను మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. వారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందు వరుసలో ఉంటున్నాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గత నెలలో 12 ఫిర్యాదులు వస్తే 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండు, రైల్వే స్టేషన్లు, కళాశాలల వద్ద షీటీం సభ్యులు నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. వీటి పై సమాచారం అందించే వారు 98126 70235 చరవాణి సంప్రదించాలని కోరారు
హుజుర్నగర్ నియోజకవర్గంలోని లింగగిరి గ్రామానికి చెందిన మధిర శ్రీనివాస్ రెడ్డి, షేక్ లతీఫు ఇద్దరు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఉద్యోగాలలో ఫైర్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా జిల్లా టాప్ ర్యాంకులు సాధించారు. అయితే వీరిద్దరూ లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ చదువుకుంటూ ఈ ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో కుటుంబసభ్యులు మిత్రులు బంధువులు అభినందించారు.
సూర్యాపేట ప్రమాద ఘటనలో బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతరెడ్డి సరిత టీచర్(44),
లునావత్ రుక్కమ్మ(63), గొలుసు వేదస్విని(17నెలలు) మృతిచెందారు. కలకొట్ల లావణ్య, కంపసాటి మహేష్(ఆటో డ్రైవర్), శివరాత్రి హైమావతి, రాములమ్మ, బొప్పాని పావని, మంగయ్య(టీచర్), చెరుకుపల్లి సైదమ్మ, చెరుకుపల్లి శైలజ, చెరుకుపల్లి విజయేందర్, జీడిమెట్ల సైదులు, కొమ్ము సువర్ణ, గొలుసు సంధ్య, గొలుసు మోక్షిత్, సైదులు గాయపడ్డారు.
హుజూర్ నగర్ మండలం దొంగల దిబ్బ, అమరవరం గ్రామాల మధ్య ఉన్న డొంక రోడ్డులో కుళ్లిన మృతదేహం లభ్యమైంది. మృతుడు హనుమంతుల గూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ మృతి పై పోలీసులు ఆరా తీస్తున్నారు. బైక్ మీద నుంచి కింద పడ్డాడా, ఎవరైనా చంపి ఇక్కడ పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు.
Sorry, no posts matched your criteria.